బ్రిటన్ లో జగన్... తెలుగునాట లొల్లి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బ్రిటన్ పర్యటనలో ఇండోర్ , ఔట్ డోర్ గేమ్స్ తో సేదతీరుతున్నట్టుగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి వరసగా ఫొటోలు ఇంటర్నెట్ లోకి విడుదల అవుతున్నాయి. తొలి రోజు గోల్ఫ్ ప్లేయింగ్ కు సంబంధించిన ఫొటోలు విడుదల కాగా, రెండో పర్యాయం గా ఫుట్ బాల్, చెస్ ప్లేయింగ్ కు సంబంధించిన ఫొటోలు విడుదల అయ్యాయి. ఇక యథాతథంగా ఈ ఫొటోల విషయంలో రెండు రకాల  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ అభిమానులకేమో ఈ ఫొటోస్ ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్ ది బాధ్యతారాహిత్యం అని తేల్చేస్తున్నారు. రాష్ట్రం  కష్టాల్లో ఉంటే జగన్ విహరిస్తున్నాడంటూ వీరు విరుచుకుపడుతున్నారు. అయినా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అంతా హ్యాపీసే అనేసే పచ్చ బ్యాచ్ జగన్ విదేశానికి వెళితే మాత్రం ఇక్కడ కష్టాల గురించి ఏకరువు పెడుతోంది! అమరావతి లో భూమి కుంగుబాటు దగ్గర నుంచి విత్తన వేరుశనగ పంపిణీ వైఫల్యం వరకూ అన్నింటినీ ఏకరువు పెడుతున్నారు తెలుగుదేశం అభిమానులు. వీటికీ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ విదేశీ పర్యటనకు ముడిపెడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా అన్ ఫిట్ అని వీరు తేలుస్తున్నారు.

ఇక తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా జగన్ విదేశీ పర్యటన కు బాగానే కవరేజీ ఇస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఏ రైతు భరోసా యాత్రనో చేపడితే కవరేజీ ఇవ్వని మీడియా వర్గాలు బ్రిటన్ లో జగన్ పర్యటన గురించి మాత్రం బాగా కవరేజీ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించుకోవాలి. జగన్ జనాల్లో ఉన్నప్పుడు కవరేజీ ఇస్తే అది అతడికి పాజిటివ్ అవుతుంది.. కుటుంబంతో విహరిస్తున్నాడని కవరేజీ ఇస్తే అతడిపై జనాల్లో వ్యతిరేకత ప్రబలుతుంది.. కాబట్టి ఈ విధమైన  కవరేజీ ఇవ్వాలనేది పచ్చపేపర్ల లెక్క కావొచ్చు!

అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చేపట్టే విదేశీ పర్యటనలు మాత్రమే గాక ఇటీవలే ఆయన కూడా కుటుంబంతో వారం రోజుల పాటు విదేశాల్లో విహరించి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాబు ఏయే దేశాలు వెళ్లాడనే విషయం గురించి స్పష్టత లేదు. జగన్ పర్యటనకు సంబంధించి ఫొటోలు అయినా విడుదల అయ్యాయి. ఈయన ఏ గోల్ఫ్ మైదానంలో బ్యాట్ పట్టాడో కూడా పచ్చ పేపర్లే క్లారిటీ ఇస్తున్నాయి. బాబు పర్యటనలో ఈ మాత్రం పారదర్శకత లేకపోయింది.  Readmore!

ఇక జగన్ స్టిల్స్ పై పచ్చ పార్టీ అభిమానులు విమర్శలు చేస్తుండగా..వైకాపా ఫ్యాన్స్ కూడా దానికి గట్టిగానే సమాధానమిస్తున్నారు. జగన్ గోల్ఫ్ , చెస్ ఆడుతూ గడుపుతున్నాడు తప్ప లోకేష్ లాగా తెల్ల తోలు అమ్మాయిలతో స్విమ్మింగ్ చేస్తూ వాళ్లతో సరసాలు ఆడుతూ విదేశీ పర్యటనలు చేయడం లేదు అంటూ వీరు స్ట్రెస్ చేస్తున్నారు! 

Show comments