నాగ్ దర్శకుడికి అంత భయమెందుకు..?

రారండోయ్ వేడుక చూద్దాం... టైటిల్ లోనే బోలెడంత సెలబ్రేషన్ ఉంది. యూనిట్ కూడా ప్రస్తుతం సెలబ్రేషన్ మూడ్ లోనే ఉంది. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరే దర్శకుడు కల్యాణ్ కృష్ణ. సినిమాపై నమ్మకంతోనే ఉన్నాడు ఈ దర్శకుడు. అయితే ఎక్కడో ఏదో మూల భయం మాత్రం అలానే ఉంది. దీనికి కారణం ఓ నెగెటివ్ సెంటిమెంట్.

టాలీవుడ్ లో సెకెండ్ మూవీతో ఫ్లాప్స్ తెచ్చుకున్న దర్శకులే ఎక్కువ. ఈమధ్య కాలంలో కొరటాల శివ లాంటి దర్శకులు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినప్పటికీ.. ఎక్కువ మంది దర్శకులకు మాత్రం ప్రతికూల ఫలితాలే వచ్చాయి. అదే ఇప్పుడు కల్యాణ్ కృష్ణ భయం.

సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ సినిమాలో కల్యాణ్ టాలెంట్ చూసిన నాగార్జున.. అతడ్ని తన కాంపౌండ్ నుంచి బయటకు వదల్లేదు. కాస్త లేట్ అయినా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను అప్పగించాడు. పైగా కల్యాణ్ కృష్ణపై నమ్మకంతో సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మించాడు నాగ్.

ఓ వైపు బ్యాడ్ సెంటిమెంట్, మరోవైపు సినిమా ప్రెషర్.. టెన్షన్ అంతా ఇప్పుడు కల్యాణ్ కృష్ణలోనే కనిపిస్తోంది.

Show comments