ప్రేమ లేకపోతే.. సెక్స్ ‘దాంతో’ సమానమన్న హీరో!

సినిమా వాళ్ల చేత హాట్ చాట్ చేయించడం కరణ్ జొహార్ కు అలవాటే. ఒక్కో వారం ఇద్దరిద్దరు హీరోలను కాఫీకి అని పిలిచి వారి చేత రకరకాల అంశాల గురించి మాట్లాడిస్తూ.. ప్రత్యేకించి ప్రేమ-శృంగారం- శృంగార అనుభవాలు వంటి టాపిక్స్ గురించి ఎక్కువగా వారి చేత చెప్పిస్తుంటాడు. ఈ పరంపరలో.. కాఫీ విత్ కరణ్ లో రణ్ భీర్ కపూర్ కొన్ని ఆసక్తికరమైన హాట్ కామెంట్స్ చేశాడు.

శృంగారానుభవాల గురించి ఇతడు మాట్లాడుతూ.. “ ప్రేమ లేనిదే శృంగారం చేయలేం. ఒకవేళ ప్రేమ లేకుండా రతిలో పాల్గొనడం అంటే.. అది ‘స్వయంతృప్తి’ పొందడంతో సమానం.’’ అంటూ వ్యాఖ్యానించాడు రణ్ భీర్. ఇప్పటికే కరణ్ చాట్ షోలో సెక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.. దీంట్లో అంతా పడుకోవడం, అక్రమ సంబంధాలు వంటి అంశాల గురించి మాత్రమే చర్చ సాగుతోందని అనే అభిప్రాయాలు వినిపిస్తున్నా ఎవ్వరూ తగ్గడం లేదు.

గత వారంలో వరుణ్ ధావన్ అండ్ కో తో జరిగిన చాట్ షోలో కూడా శృంగార సంబంధ చర్చే ఎక్కువగా నడిచింది. ఇక రణ్ భీర్, రణ్ వీర్ లతో షో లో కూడా అదే పరంపర కొనసాగింది. అలాగే పోర్న్ విషయంలో కూడా రణ్ భీర్ అభిప్రాయాలను చెప్పించాడు కరణ్ జొహార్.

“ పోర్న్ మంచిది కాదు, అది హింసాత్మకం, అనారోగ్యకరం. అది చీకటి వ్యవహారం.’’ అని రణ్ భీర్ వ్యాఖ్యానించగా, దానికి రణ్ వీర్ విరుద్ధంగా స్పందించాడు. “నువ్వు తప్పు రకం పోర్న్ ను చూస్తున్నావు బ్రో..’’ అంటూ ఆ హీరో అన్నాడు!

Readmore!

Show comments