పవన్‌, త్రివిక్రమ్‌ మూవీపై క్లారిటీ లేదు

పవన్‌కళ్యాణ్‌ మలి చిత్రం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఉంటుందనేది తెలిసిందే. అయితే జనవరిలో సెట్స్‌ మీదకి వెళుతుందని అనుకున్న ఈ చిత్రం ఇంకా ముందుకి కదలలేదు. పవన్‌ ఇంకా 'కాటమరాయుడు' షూటింగ్‌ పూర్తి చేయలేదు. అది పూర్తి కావడానికి మరో నెల రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు. 

అదీ కాక 'కాటమరాయుడు' చిత్రంలో మిడిల్‌ ఏజ్డ్‌ క్యారెక్టర్‌ చేస్తోన్న పవన్‌కళ్యాణ్‌ తదుపరి చిత్రం కోసం వెయిట్‌ తగ్గి ఫిట్‌ అవ్వాలట. త్రివిక్రమ్‌ చిత్రంలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ ఉంటుందట. అంటే ఆ చిత్రం మొదలయ్యే ముందు పవన్‌ కొద్ది రోజుల పాటు తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలన్నమాట. 

ఇదిలావుంటే ఈ చిత్రంతోనే ఎన్టీఆర్‌ చిత్రాన్ని కూడా లింక్‌ చేయడం, ఇది పూర్తయిన తర్వాత అది సెట్స్‌ మీదకి వెళుతుందని, అది ఈ ఏడాదిలోనే జరుగుతుందని చెప్పడంతో అసలు పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా ఎప్పుడు మొదలువుతుంది, ఎప్పుడు పూర్తవుతుందనేది మరింత ఆసక్తికరమైంది. పైగా ఈ చిత్రం తర్వాత నీసన్‌ దర్శకత్వంలో వేదలామ్‌ చేస్తానని పవన్‌ మాట ఇచ్చాడు. ఒకవైపు ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

Readmore!
Show comments

Related Stories :