శర్వ రేంజ్ ఫిక్స్ చేయబోతున్న రాధ

ఇప్పటికే శతమానంభవతి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. వరుసగా రెండు సంక్రాంతులకు రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. మధ్యలో రాజాధి రాజా అనే ఫ్లాప్ సినిమా వచ్చినా అది శర్వానంద్ కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు మాత్రం శర్వానంద్ చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నాడు. శతమానం భవతి తెచ్చిన క్రేజ్, మార్కెట్ వాల్యూను కంటిన్యూ చేయాలంటే నెక్ట్స్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అదే పనిలో ఉన్నాడు.

శివరాత్రి కానుకగా తన కొత్త సినిమా రాధ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు శర్వానంద్. ఈ సినిమాలో శర్వ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే విషయం పాతదే. అయితే ఏ తరహాలో కనిపించబోతున్నాడనే విషయంపై మాత్రం ఈ ఫస్ట్ లుక్ లో క్లారిటీ ఇచ్చేశారు. వేసుకున్నది ఖాకీనే అయినప్పటికీ నెత్తిన కిరీటం, చేతిలో ఫ్లూటు పట్టుకొని కృష్ణుడిగా కనిపిస్తున్నాడు రాధ. ఈ ఒక్క లుక్ తో సినిమాపై కూసింత క్రేజ్ క్రియేట్ చేయగలిగాడు. సినిమా కూడా ఫస్ట్ లుక్ అంత కొత్తగా ఉండి, నలుగుర్ని ఎట్రాక్ట్ చేయగలిగితే శర్వానంద్ కు ఇక తిరుగుండదు. 

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం నాని, శర్వానంద్ వైపే చూస్తోంది. వరుస విజయాలతో మోస్ట్ డిపెండబుల్ హీరోగా మారిపోయాడు నాని. ఇప్పుడు శర్వానంద్ కూడా ఆ కేటగిరీలోకి చేరతాడని చాలామంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాల్ని అందుకోవాలంటే రాధ కచ్చితంగా హిట్ అవ్వాలి.

Readmore!
Show comments