కిందామీదా పడి ఒడ్డున పడ్డ సింగం

సింగం-3 తెలుగులో ఫ్లాప్ అయింది. నిర్మాతకు మిగిలిందేం లేదు. తమిళ్ లో కూడా ఇది సూర్య క్రేజ్ తో మాత్రమే రన్ అయింది. ఎట్టకేలకు ఈ సినిమా 50 రోజులు (ఫైనల్ రన్) పూర్తిచేసుకుంది. తెలుగులో ఈ సినిమా ఊసెత్తేవాడు లేడు. తమిళ్ లో మాత్రం 50 డేస్ అంటూ ట్రెండింగ్ బాగానే చేస్తున్నారు. ఈ 50 రోజుల్లో సింగం సాధించింది ఒక్కటే. ఎలాగోలా లాస్ నుంచి గట్టెక్కి ఒడ్డునపడింది.

సింగం-3 రిలీజ్ కు ముందు వరకు ఈ సిరీస్ పై మంచి క్రేజ్ ఉండేది. మొదటి 2 సినిమాలు తెలుగు-తమిళ భాషల్లో హిట్ అవ్వడంతో.. ఆటోమేటిగ్గా సింగం-3పై క్రేజ్ క్రియేట్ అయింది. తీరా మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత.. ఇక సింగం ఫ్రాంచైజీని ఆపేస్తే బెటరనే కామెంట్సే ఎక్కువగా వినిపించాయి.

ఈ కామెంట్స్ మేకర్స్ చెవిలో కూడా పడ్డాయి. కుదిరితే సింగం-4 తీస్తానని దర్శకుడు హరి ఆ మధ్య ప్రకటించినప్పటికీ... ఇక దీనికి సీక్వెల్ తీయకపోవడమే మంచిదని తాజాగా సూర్య అభిప్రాయపడ్డాడు. కథను కొనసాగించేంత స్టఫ్ ఉన్నప్పటికీ.. గెటప్, ఎమోషన్స్ లో కొత్తదనం లేకపోవడం సింగం సిరీస్ లో ప్రధాన లోపం.

Show comments