ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా కాటమరాయుడు దర్శకుడు డాలీ. ఆ సినిమాలో శృతిహాసన్ లుక్స్ పై విమర్శలు వెల్లువెత్తిన విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో శృతికి ఇచ్చిన కాస్ట్యూమ్స్ కోఠి ఫుట్ పాత్ పై కూడా దొరుకుతాయని కామెంట్స్ వచ్చాయి. ఎట్టకేలకు ఈ కామెంట్స్ తో ఏకీభవించాడు డాలీ.
కాటమరాయుడు సాంగ్స్ కోసం ముంబయికి చెందిన డిజైనర్లను రంగంలోకి దించారట. వాళ్లకు ముందుగానే పేమెంట్స్ అన్నీ చేశారట. అయితే ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, లొకేషన్ కు సెట్ అవుతాయా లేదా, పవన్ కల్యాణ్ సరసన ఆ దుస్తులు సూట్ అవుతాయా లేదా లాంటి చెకింగ్స్ ఏవీ జరగలేదట. డిజైనర్లపై గుడ్డి నమ్మకంతో నేరుగా లొకేషన్ కు వెళ్లిపోయారట. తీరా కొత్త కాస్ట్యూమ్ లో శృతిహాసన్ కెమెరా ముందుకు వచ్చేసరికి అంతా షాక్.
శృతిహాసన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు యూనిట్ లో ఎవరికీ నచ్చలేదట. పోనీ మారుద్దామంటే అప్పటికే టైం అయిపోయిందట. మరోవైపు రిలీజ్ డేట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉండడంతో.. సాంగ్స్ చుట్టేశారట. శృతిహాసన్ చెత్త లుక్ వెనక అసలు మేటర్ ఇదేనంటున్నాడు డాలీ.