అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న స్టార్ హీరో!

మలయాళ నటి భావన దాడి పై తొలి సారి స్పందించాడు ఆ ఇండస్ట్రీ స్టార్ హీరో దిలీప్. భావనపై దాడి, ఆమెతో కొందరు అగంతకులు ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేయడం వెనుక ఈ హీరో ఉన్నట్టుగా గట్టి ప్రచారమే జరిగింది. భావన కూడా ఆ దాడి వెనుక కొంతమంది పెద్ద మనుషుల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించింది. ఆ పెద్ద మనిషి దిలీపే అనే ప్రచారానికి ఊతమిచ్చింది మీడియా. గతంలో భావన, దిలీప్ లో ఒక విషయంలో తగాదా పడ్డారని.. దిలీప్ మాజీ భార్య మంజూ వారియర్ కు భావన స్నేహితురాలని.. మంజూకు దిలీప్ విడాకులు ఇచ్చిన సమయంలో భావన ఆమెకు అనుకూలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. భావనపై దాడికి దిలీప్ కుట్ర చేసినట్టుగా కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేశాయి. భావన కూడా పదే పదే.. కొందరు పెద్ద మనుషులున్నారు.. అనే మాట మాట్లాడటంతో చూపులన్నీ దిలీప్ మీదికే మళ్లాయి. 

ఇన్ని రోజులూ ఈ వ్యవహారంపై స్పందించని ఆ స్టార్ హీరో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ అంశంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. తనపై అనుమానపు చూపులు, ఆరోపణలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.. అంటూ దిలీప్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. వాటిని తప్పించుకోవడానికి అంతకు మించిన మార్గం లేదనిపించిందని దిలీప్ వ్యాఖ్యానించాడు. అయితే తనకు ఒక కూతురుందని, ఆమె కోసం బతకాలని అనుకున్నానని అన్నాడు. దిలీప్ తొలి వివాహం ఫలితంగా ఒక కూతురు ఉంది. ఆమె కోసమే తను బతికున్నానని ఈ హీరో అన్నాడు. ఇక కావ్యమాధవన్ తో రెండో వివాహంపై స్పందిస్తూ.. ఆమె తనకు మంచి స్నేహితురాలు, అంతకు మించి అని వ్యాఖ్యానించాడు. కావ్య మాధవన్ తో దిలీప్ కు అనుబంధం ఉందనే పుకార్ల నేపథ్యంలో మంజు వారియర్ తో విడాకులు అయ్యాయి. అప్పటికే కావ్యకు కూడా వివాహం అయ్యింది. తర్వాత వీరు తమ తమ పార్టనర్స్ తో విడాకులు తీసుకుని వివాహం చేసుకున్నారు.

Show comments