అలా ఎలా డైరక్టర్ తో 'అల్లరి' సినిమా

కామెడీ చిత్రాల కథానాయకుడిగా మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు అల్లరి నరేష్‌ మరో సినిమా ఓకె చేసారు. ప్రస్తుతం ఓ సినిమా ఈశ్వర్ డైరక్షన్ లో షూట్ లో వుంది. మరో సినిమా నాగేశ్వర రెడ్డి డైరక్షన్ లో సైన్ చేసారు. ఇప్పుడు ఇంకో సినిమా ఓకె చేసారు.   

ఈ తాజా చిత్రానికి ప్రముఖ రచయిత, నటుడు కృష్ణభగవాన్‌ కథ, మాటలు అందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు. 'అలాఎలా' చిత్ర విజయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.  ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్‌, కథ-మాటలు: కృష్ణభగవాన్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీష్‌కృష్ణ.

Show comments