పవన్, జగన్ లకు ఆహ్వానం..!

ప్రత్యేకహోదా ఉద్యమంలో తమతో కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాడు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తామేదో దీక్షను చేపడుతున్నామని దానికి హాజరు కావాలని రఘువీరుడు పిలిచాడు. మరి ఈ పిలుపుకు స్పందన ఎలా ఉంటుందో వేరే వివరించనక్కర్లేదు. అటు జగన్, ఇటు పవన్ కాంగ్రెస్ ను చీదరించుకునే అవకాశం ఉంది. 

అసలు విభజన సమస్య కు మూల కారణం కాంగ్రెస్ పార్టీనే కదా. ఏదో చేద్దాం అనుకుని కాంగ్రెస్ అధినేత్రి ఏపీని నిలువునా చీల్చివేసింది. అలా చేసిన విభజనలోనూ ఏపీకి తీవ్రమైన అన్యాయమే చేసింది. అందుకు శిక్షగా కాంగ్రెస్ ఏపీలో దుస్థితిని అనుభవిస్తోంది. అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు దక్కింది బూడిదే. 

ఇలాంటి నేపథ్యంలో ఉనికి పాట్లు పడుతున్న కాంగ్రెస్ జగన్ , పవన్ పేర్లను ప్రస్తావించి కాస్తంత ప్రచారాన్ని పొందాలని యత్నిస్తున్నట్టుగా ఉంది.ఆ వ్యూహం మేరకే రఘువీరారెడ్డి వాళ్లను తమతో కలిసి రమ్మంటున్నాడు. అయినా ఏపీలో చాలా రకాలుగా నైతికార్హత కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పిలిస్తే పోయేదెవరు. 

జనాలే ఆ పార్టీని తిరస్కరించి, నడుము కాళ్లు విరగొట్టి మూలన పడేశాకా రఘువీరా రెడ్డి పిలిస్తే వెళ్తారా? కాంగ్రెస్ ను తిట్టడం కూడా జనాలు మానేశారు. ఒక్క చంద్రబాబు తప్ప.. కాంగ్రెస్ పేరును తలిచే నాథుడు లేడు. తన దీక్షలో కూడా చంద్రబాబు కాంగ్రెస్ నే నిందిస్తూ… నిందా పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. 

Show comments