వరదనీళ్లతో పచ్చ రాజకీయం.. అంతా బాబు పుణ్యమేనట!

గాలికి పోయే పేల పిండి కష్ణార్పణం.. అనేది పాత సామెత. అయితే పచ్చమీడియా, పచ్చ పార్టీ పుణ్యాన ఈ సామెతను కొంచెం మార్చుకురాసుకోవాలి. వరదకు వచ్చే నీళ్లు.. చంద్రబాబు పుణ్యం.. ఈ జుగల్ బంధీ పాడుతున్న పాట! విషయం ఏమిటంటే.. ఈసారి కష్ణానది జన్మస్థానం దగ్గర నుంచి ఎగువన వర్షాలు బాగా పడ్డాయి. ఇదంతా లానినో ఎఫెక్ట్ అని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ముగిసింది.. లానినో ప్రభావంతో అధిక వర్షపాతం ఉంటుంది.. అని వీరు వివరిస్తున్నారు. మరి ఏదేతేనేం.. మే నుంచే మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కష్ణానదికి పైవైపున ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుతున్న క్రమంలో దిగువకు కూడా నీళ్లు వదులుతున్నారు. మరి ఈ సారైనా శ్రీశైలం వద్ద ఈ నీళ్లు ఆగి.. రాయలసీమకు ఉపయోగపడతాయని అనుకొంటే.. ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లను దిగువకు వదిలేయడమే సరిపోతోంది.

ఇంత వరదలో కూడా రాయలసీమ ప్రయోజనాలతో ముడిపడ్డ కనీస మట్టానికి నీరు చేరకనే.. తాగునీటికి అని 10 టీఎంసీలు, పుష్కర స్నానానికి మరో మూడు టీఎంసీ నీళ్లు వదిలేశారు! అసలు.. శ్రీశైలం నుంచి నీళ్లు దిగువకు అవసరమే లేదని.. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. పట్టిసీమకు సంబంధించిన పచ్చ పార్టీ పేపర్ల వార్తా కథనాల్లో దేన్ని చూసినా.. ఇది అర్థం అవుతుంది. పట్టిసీమ కట్టింది రాయలసీమను ఉద్ధరించడానికే అని చెప్పుకుంటూనే.. మరోవైపు శ్రీశైలం నుంచి నీళ్లు దోచేశారు. అరే.. కనీస మట్టానికి అయినా చేరనివ్వండని మొత్తుకున్నా.. రాయలసీమ ఆందోళన అరణ్య రోదనే అయ్యింది.

ఇంత దరిద్రపు గొట్టు ప్రభుత్వ తీరుతో కూడా విసుగు చెందక వరుణదేవుడు కరుణ చూపించాడు. దిగువ వాళ్ల దారుణమైన దాహం అంతా తీర్చడానికి రాయలసీమకు అన్యాయం చేసినా.. పట్టిసీమ ప్రయోజనాలు అందాయని కూస్తూనే.. శ్రీశైలం నీళ్లను దోచుకెళ్లినా.. చివరకు ఆరు టీఎంసీల నీళ్లను రాయలసీమకు వదిలే పరిస్థితి వచ్చింది. ఎగువ ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడంతో వస్తున్న నీళ్లు వస్తాయన్న అంచనాలతో.. సీమకు ఆరు టీఎంసీల నీళ్లను కేటాయించనున్నామని ప్రకటించారు. ఇంకేముంది.. పచ్చ పార్టీ పత్రికలైన పేపర్లు అప్పుడే అందుకున్నాయి! మళ్లీ పట్టిసీమను తెరపైకి తెచ్చాయి. ఈ ఆరు టీఎంసీల నీళ్లూ.. పట్టిసీమ పుణ్యమేనట! బాబుగారు విజన్ కొద్దీ కట్టిన ఆ పట్టిసీమతోనే సీమకు ఇప్పుడు నీళ్లు సాధ్యం అవుతున్నాయని పచ్చపేపర్లు రాసుకొచ్చాయి, పచ్చ పుత్రులు వాదిస్తున్నారు! అక్కడికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సీమకు ఇప్పుడే తొలిసారి నీళ్లు అందిస్తున్నట్టుగా ఉంది వీరి వాదన! ఆ ప్రాజెక్టుపై సీమకు ఏమీ హక్కులులేవు.. బాబుగారు దయతో.. నీళ్లు వదులుతున్నారు అని మాట్లాడుతున్నారు.

అయినా సిగ్గుశరం లేని రాతలకు, నరంలేని నాలుకలకు హద్దేముంది? దాహమంతా తీర్చుకుని ఆరు టీఎంసీల నీళ్లను వదులుతూ.. ఇది కూడా పట్టిసీమ పుణ్యమే, చంద్రబాబు పుణ్యమే అని చెప్పుకుంటున్న ఈ దివాళాకోరు తనాన్ని ఏమనాలో ఎలా తిట్టాలో అర్థంకాదు. ఈ పుల్కా పేపర్లు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సీమకు దక్కాల్సిన నీళ్లకు.. ఆరు టీఎంసీలకూ పొంతనే లేదు. తాగునీటికి, సాగునీటికి ఇవ్వాల్సిన అసలు నీళ్ల లెక్క ఏంది? ఆరు టీఎంసీలేక పట్టిసీమ పుణ్యమని అనడం ఏది? ఏమైనా బుర్ర ఉండి రాతలు రాస్తున్నారా? అన్నం తింటున్నారా? లేక అశుద్ధం తింటున్నారా? పట్టిసీమ ప్రహసనం కోసం.. ఇలా రాయలసీమ న్యాయమైన హక్కులను కూడా అనుకూల ప్రచారంగా మార్చుకోవడం.. పట్టిసీమ అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలా సీమను ఉద్ధరిస్తున్నట్టుగా చెప్పుకొంటూ పబ్బం గడుపుకోవడమా? ఇదెక్కడి మోసం? Readmore!

Show comments