గత వారం చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటీ లేకపోవడంతో దసరా చిత్రాలకి మరో వారం రోజుల పాటు స్పేస్ దొరికింది. దీనిని మహానుభావుడు చిత్రం బాగా క్యాష్ చేసుకుంది. సెకండ్ వీకెండ్లో కూడా మంచి వసూళ్లు రాబట్టుకుని సూపర్‌హిట్ స్టేటస్ దక్కించుకున్న ఈ చిత్రం దసరా విజేతగా నిలిచింది.
జై లవకుశ చిత్రానికి మూడవ వారంలోను షేర్స్ వచ్చాయి కానీ బ్రేక్ ఈవెన్ అయ్యేంత స్థాయిలో రాలేదు. నిర్మాత ప్రకటిస్తోన్న స్థాయిలో వసూళ్లు రాకపోయినా కానీ వచ్చిన టాక్‌కి అయితే బెటర్ వసూళ్లనే సాధించింది. ఓవరాల్‌గా యావరేజ్ స్థాయిని అందుకున్న ఈ చిత్రం ఎన్టీఆర్ సినిమాల్లో సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుంది.
స్పైడర్ చిత్రానికి మాత్రం సెకండ్ వీక్ డిజాస్ట్రస్‌గా తయారైంది. మొదటి వారంలోనే వసూళ్లు బాగా పడిపోవడంతో ఈ చిత్రం ఫ్లాప్ ఖరారైంది. మహేష్ సినిమాల్లోనే అత్యధిక నష్టం చవిచూసిన సినిమాగా ఇది రికార్డులకి ఎక్కే అవకాశముంది. ఈవారం 'రాజుగారి గది 2' రిలీజ్ అయింది.