బీజేపీ ద‌య‌నీయ స్థితికీ ఇది నిద‌ర్శ‌న‌మా!

ఒక‌వైపు త‌మ టార్గెట్ 400 లోక్ స‌భ సీట్లు అని క‌మ‌ల‌నాథులు ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు! అయినా దేశ వ్యాప్తంగా అంత సానుకూల వేవ్ ఉన్న‌ప్పుడు క‌మ‌లం పార్టీ కొన్ని ర‌కాల స్నేహాలు ఎందుకు చేస్తోంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌! అది కూడా తాము గ‌తంలో తీవ్రంగా విమ‌ర్శించిన వాళ్ల‌ను బీజేపీ స్నేహితులుగా చేసుకుంది. వాళ్లేమీ త‌క్కువ తిన‌లేదు బీజేపీని అన‌రాని మాట‌లూ అన్నారు!

నితీష్ కుమార్, కుమార‌స్వామి, చంద్ర‌బాబు నాయుడు.. వీరి సంగ‌తి దేశానికంతా తెలిసిందే!  ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే ర‌కం! వీరిని బీజేపీ కూడా గ‌తంలో ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శించింది. కుమార‌స్వామి, చంద్ర‌బాబులు బీజేపీని అవ‌స‌రానికి వాడుకుని వ‌దిలేసిన బాప‌తే! త‌మ అవ‌కాశ‌వాదం కొద్దీ వీరు బీజేపీతో స్నేహాన్ని, వైరాన్ని సాగించిన వారు, సాగిస్తున్న వారు! వీరి పార్టీల‌ను బీజేపీ గ‌తంలో తీవ్రంగా విమ‌ర్శించింది. కుటుంబ పాల‌న, అవినీతి అంటూ మోడీనే వీరిని విమ‌ర్శించారు!

అదంతా అలా ఉంటే.. అన‌ప‌ర్తి సీటు విష‌యంలో బీజేపీ ఫీట్లు చాలు.. ఆ పార్టీ ఏంటి ఈ ఖర్మ అనే సందేహం రావ‌డానికి! అన‌ప‌ర్తి విష‌యంలో బీజేపీ మొద‌ట్లో చాలా హ‌డావుడి చేసింది. మాజీ సైనికుడిని ఎన్నిక‌ల పోటీలో పెట్టిన‌ట్టుగా ఘ‌నంగా ప్ర‌క‌టించుకుంది. పొత్తులో భాగంగా బీజేపీ పోటీకి చంద్ర‌బాబు నాయుడు కేటాయించిన సీట్ల‌లో చాలా వ‌ర‌కూ చంద్ర‌బాబు అతి స‌న్నిహితులే ఉన్నారు! వాళ్లంతా తెలుగుదేశంలో ద‌శాబ్దాలుగా ప‌ని చేసిన వారు, చంద్ర‌బాబు అవ‌స‌రం కోసం బీజేపీలోకి వెళ్లిన వారే! అయితే వారికే బీజేపీ టికెట్ల‌ను కేటాయించింది.

అన‌ప‌ర్తి విష‌యంలో అయితే మ‌రీ దారుణం! ఒక మాజీ సైనికుడిని అభ్య‌ర్థి అంటూ ప్ర‌క‌టించి, చివ‌ర‌కు చంద్ర‌బాబు ఒత్తిడికి త‌గ్గి, తెలుగుదేశం అభ్య‌ర్థికే బీజేపీ కండువా వేసి టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో ఇదో కామెడీ! ఒకవైపు దేశంలో త‌మ టార్గెట్ 400 లోక్ స‌భ స్థానాలు, మోడీకి తిరుగులేదు, బీజేపీ ఎదురులేదు.. అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూ, ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో బీజేపీ త‌న నిర్ణ‌యానికి క‌ట్టుబడ‌లేక‌పోయింది!

గెలుపో ఓట‌మో.. మేం ఒక మాజీ సైనికుడికి టికెట్ ఇచ్చాం, తేల్చుకుంటాం.. అంటూ ముందుకు వెళ్లి ఉంటే, క‌నీసం ఆ ఒక్క సీటు విష‌యంలో అయినా బీజేపీ వెన్నెముక‌తో వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింది! ఎలాగూ మిగ‌తా సీట్ల‌లో పోటీ అంతా సీఎం ర‌మేష్ లు, సుజ‌నా చౌద‌రులే క‌దా! క‌నీసం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించినందుకు అయినా బీజేపీ క‌ట్టుబ‌డాల్సింది! అభ్య‌ర్థిని మార్చ‌డం కాదు, తెలుగుదేశం టికెట్ ద‌క్క‌లేద‌ని రోడ్డెక్కిన అత‌డికి కాషాయ కండువా వేసి, అత‌డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి బీజేపీ కామెడీ చేస్తోంది! బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి ఈ కామెడీలు తెలియ‌నివి కాక‌పోవ‌చ్చు! మ‌రి 400 లోక్ స‌భ సీట్ల‌కు పొడిచే వాళ్లు మ‌రీ ఇంత కామెడీ పీసులు అయిపోతారా! ఇది బీజేపీ ద‌య‌నీయ స్థితికి నిద‌ర్శ‌నం కాదా?

Show comments