ఒకే రోజు మూడు సినిమాలు.. మూడిటిపైనా భారీ అంచనాలున్నాయి. మామూలుగా అయితే ఇదో కష్టతరమైన పోటీ. ఒకదానితో ఒకటి పోటీ పడేందుకు ఇష్టపడని సందర్భమే. కానీ తప్పదు. పోటీ అనివార్యమయ్యింది. అందుకే, దీన్నిప్పుడు అంతా ఆరోగ్యకరమైన పోటీగా అభివర్ణిస్తున్నారు. 'ఆ సినిమా చూసి, మా సినిమాకి రండి, ఆ తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళండి' అని ఒకరంటున్నారు.
'మా సినిమా చూసి, మరో సినిమాకెళ్ళండి, ఆ తర్వాత ఇంకో సినిమానీ చూసెయ్యండి..' అని మరొకరంటున్నారు. 'మూడు సినిమాల్లో ముందు ఏది దొరికితే అది చూసేసి, అదే రోజు మిగతా రెండు సినిమాల్నీ చూస్తే బాగుంటుంది..' అని ఇంకొకరు చెబుతున్నారు. మూడు సినిమాలకు చెందినవారిలా సినీ ప్రేక్షకుల్ని 'కన్విన్స్' చేసేస్తోంతో, ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అన్పిస్తోంది కదూ.!
హీరో నాని అయితే, 'కొట్టండి.. కొట్టాలి.. కొడుతున్నారు అంతే.. గుడ్ లక్ గైస్' అంటూ సోషల్ మీడియాలో ఆ మూడు సినిమాలకీ ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు. నాని ఒక్కడే కాదు, చాలామంది యంగ్ హీరోలు, సీనియర్ హీరోలూ ఒక సినిమాకి కాదు, ఒకేసారి మూడు సినిమాలకీ ఆల్ ది బెస్ట్ చెబుతుండడం గమనార్హం.
మొన్నామధ్య, అంటే ఈ సంక్రాంతికి మూడు చిరంజీవి, బాలకృష్ణ, శర్వానంద్ పోటీ పడినప్పుడూ దాదాపు ఇదే వాతావరణం సినీ పరిశ్రమలో కన్పించింది. ఆ మూడు సినిమాలూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ గ్యాప్ ఒక రోజు, అంతకు మించి వుందప్పుడు.
కానీ, ఇప్పుడలా కాదు. ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమానీ తక్కువగా చూడలేని పరిస్థితి. దేనికదే విభిన్నం. సో, ఈ శుక్రవారం టాలీవుడ్ పరంగా ఓ ఇంట్రెస్ట్ అండ్, హెల్తీ ఫైట్ జరగనుందన్నమాట. ఒకే రోజు మూడు సినిమాల రిలీజ్‌లు, మూడూ ఘనవిజయాలు అందుకుంటే ఆ కిక్కే వేరప్పా.!