పవన్ టైటిల్ తో త్రివిక్రమ్ సినిమా

పవన్ కల్యాణ్ మొదటి సినిమా పేరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీన్ని కొంచెం మార్చి త్రివిక్రమ్ కొత్త టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆ సినిమా పేరు అక్కడబ్బాయ్ - ఇక్కడమ్మాయి. త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త టైటిల్ రిజిస్టర్ అయింది. త్వరలోనే పవన్ తో చేయబోయే కొత్త సినిమాకు త్రివిక్రమ్ ఈ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ కొత్త సినిమా కోసం తీసుకున్న టైటిల్ కాదిది. పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ నితిన్ కోసం తీసుకున్నారు. 

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు. పవన్, త్రివిక్రమ్ తో పాటు నితిన్ కు చెందిన శ్రేష్ఠ్ మూవీస్ కూడా కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ ప్రాజెక్టు కోసమే అక్కడబ్బాయ్-ఇక్కడమ్మాయి టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట త్రివిక్రమ్. ఈ మూవీలో నితిన్ ఎన్నారై కుర్రాడిగా కనిపించబోతున్నాడట. 

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే కృష్ణ చైతన్యతో మూవీ ఉంటుంది. ఓవైపు ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూనే, మరోవైపు పవన్-త్రివిక్రమ్ కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు.

Show comments