వంశీ పైడిపల్లి కథపై హైకోర్టు స్టే

మొత్తానికి పివిపి సంస్థ తేనెతుట్ట కదిపేసారు. మహేష్ - వంశీ పైడిపల్లి సినిమా వ్యవహారంలో తరువాతి స్టెప్ వేసారు. పివిపి సంస్థ అభ్యర్థన మేరకు చెన్నయ్ హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేసింది. పివిపి సంస్థ మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమా కోసం తయారుచేసిన కథను, ఆ దర్శకుడు వంశీ పైడిపల్లి, రచయితలు హరికృష్ణ, ఎ సోలమన్ లు మరే విధంగానూ వాడకూడదని ఆ ఇంజక్షన్ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కోన్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబుతో, వంశీ పైడిపల్లి తో సినిమాలు చేసేందుకు పివిపి సంస్థకు అగ్రిమెంట్ లు వున్నాయి. ఈ మేరకు గత కొన్నాళ్లు గా పివిపి సంస్థ ఖర్చుతో వంశీ పైడిపల్లి అండ్ కో స్క్రిప్ట్ రెడీ చేసారు. కానీ ఎక్కడో తేడా వచ్చింది. పివిపి సంస్థతో వంశీ పైడిపల్లికి పొసగలేదు. దాంతో ప్రాజెక్టులొకి అశ్వనీదత్, దిల్ రాజు ప్రవేశించారు. దీంతో ఓ కార్పొరేట్ సంస్థగా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం పివిపి సంస్థ కోర్టును ఆశ్రయించక తప్పలేదు. 

అటు మహేష్ తో నిర్మించిన బ్రహ్మోత్సవం భారీ నష్టాలను అందించగా, వంశీ పైడిపల్లి డైరక్షన్ లో నిర్మించిన ఊపిరి సినిమా ఇరవై కోట్ల మేరకు నష్టాలను అందించింది. అందువల్ల ఆ ఇధ్దరు ముందస్తు ఒప్పందం ప్రకారం పివిపి సంస్థలొ సినిమాలు చేయాల్సి వుంది. అది జరగకపోవడంతో కోర్టు ముంగిటకు పివిపి సంస్థ వెళ్లక తప్పలేదని తెలుస్తోంది.

Show comments