చంద్రబాబు మార్క్‌ మహిళా సాధికారత.!

మహిళా పార్లమెంటేరియన్ల జాతీయ సదస్సుని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించేస్తోంది చంద్రబాబు సర్కార్‌. దురదృష్టవశాత్తూ, ఓ పక్క 'సాధికారత' అనే టాపిక్‌ మీద మహిళా పార్లమెంటేరియన్ల జాతీయ సదస్సులో వక్తలు ప్రసంగించేస్తున్నారు. అదే సమయంలో మహిళా ప్రజా ప్రతినిథులకు తీవ్ర అవమానం జరుగుతోంది.. అదీ అమరావతి సాక్షిగా. ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికన్నా తానే మిన్న.. అనే స్థాయిలో ప్రసంగాలు చేసేశారు. కానీ, చెప్పేదొకటి.. చేసేదొకటి.! 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ కవిత నిన్న అమరావతిలో ప్రసంగించారు. అద్భుతమైన ప్రసంగం చేశారామె. నిజానికి తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌ సర్వనాశనం చేసేసింది రాజకీయంగా. అయినాసరే, రాజకీయం వేరు.. ఇలాంటి వేదికలు వేరు. ఆమెను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ఆమె కూడా హుందాగా వ్యవహరించారక్కడ. పొరుగు రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రత్యర్థిని ఆహ్వానించిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఎమ్మెల్యేని రాజకీయ ప్రత్యర్థి అన్న కారణంగా అడ్డుకోవడం దుర్మార్గం అనాలా.? ఇంకేమన్నా అనాలా.? 

మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకి హాజరయ్యేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, అమరావతికి చేరుకోగానే అక్కడామెను అడ్డుకున్నారు. పోలీసులు ఆమెను ఎక్కడికి తరలించారో తెలియని పరిస్థితి. పోలీసుల తీరుని రోజా నిరసించడంతో వాగ్యుద్ధం కాస్తా, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినట్లు తెలుస్తోంది. రోజా ఆచూకీ కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క, రోజా మహిళా సదస్సుని చెడగొట్టడానికే ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు, ముఖ్యంగా మహిళా నేతలు ఆరోపిసుత్తండడం గమనార్హం. 

అసలు, అమరావతిలో ఏం జరుగుతోంది.? ఆటవిక పాలన సాగుతోందనేలా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ మాత్రందానికి మహిళా పార్లమెంటేరియన్‌ జాతీయ సదస్సు దేనికోసం.! ఇదీ చంద్రబాబు మార్క్‌ మహిళా సాధికారత. Readmore!

Show comments