ఆనం సోదరులు.. ఇప్పుడేం చేస్తారు?

తాము తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదని అంటున్నారట ఆనం బ్రదర్స్. విభజనాంతర రాజకీయాల్లో కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరారు ఆనం సోదరులు. ఇలా చేరినందుకు గానూ వచ్చే ఎన్నికల్లో తమకు టీడీపీ టికెట్లను ఇవ్వడంతో పాటు అంత వరకూ నామినేటెడ్ పదవులు కావాలని వీరు బాబుకు అప్పట్లో చెప్పుకున్నారు. వీరి డిమాండ్ల కు బాబు కూడా సమ్మతం తెలిపాడట అప్పట్లో!

మరి ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఇప్పటి వరకూ అనం అన్నదమ్ములిద్దరికీ నిరాశే మిగిలింది. రామ నారాయణ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, ఆయనకు మంత్రి పదవి ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది! ఆనం సోదరులు పార్టీలోకి వచ్చి చేరినప్పుడు ఈ ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఆ ముచ్చట కు అప్పుడే ఫుల్ స్టాప్ పడింది. రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఊసులో కూడా లేడు!

ఇక తాజాగా ఆనం వివేకానంద రెడ్డికి కూడా చంద్రబాబు ఝలకిచ్చాడు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో  పదవిని దక్కించుకోవాలని చూసిన వివేకానంద రెడ్డికి అది సాధ్యం కాలేదు. ఆఖరికి బాబు అపాయింట్ మెంట్ దక్కడం కూడా గగనం అయ్యిందట. చివరకు ఎలాగో కలిసినా.. ‘ఎవరికి ఏమివ్వాలో నాకు తెలుసు..’ అని ఇన్ డైరెక్టుగా కొట్టినట్టు చెప్పాడట చంద్రబాబు!

ముందుగా రామానారాయణ రెడ్డికి నిరాశ మిగలగా, ఇప్పుడు వివేకానంద రెడ్డికి అదే అనుభవంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఆనం సోదరులు చేయగలిగింది ఏముంది? అనేది శేష ప్రశ్న. ఏతావాతా చూస్తే… రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ చార్జి హోదా తప్ప ఆనం సోదరులకు దక్కింది ఏమీ లేదనే చెప్పాలి! చంద్రబాబు ఇంతకు మించి వీళ్లకు విలువను ఇవ్వడం లేదు. మరేం చేస్తారో ఇప్పుడు ఈ అన్నదమ్ములు! Readmore!

Show comments