అటు పవన్,ప్రభాస్ ఇటు మహేష్ మధ్యలో బన్నీ

లేట్ గా స్టార్ట్ చేసినా ఫాస్ట్ గా ఫినిష్ చేసి, సమ్మర్ మార్కెట్ ను కొల్లగొట్టడానికి డిసైడ్ అయిపోయాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. మే 19 వ తేదీని తన దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డిజె సినిమా విడుదలకు ముహుర్తంగా ఫిక్స్ చేసుకున్నాడు. మార్చిలో కాటమరాయుడు వస్తున్నాడు..ఏప్రియల్ లో బాహుబలి 2 వస్తోంది. జూన్ లో మహేష్ బాబు 'సంభవామి' ఫిక్సయింది. మధ్యలో మే లో మీడియం రేంజ్ సినిమాలు వున్నాయి కానీ భారీ సినిమాలయితే లేవు. అందుకే ఆ స్లాట్ ను తను ఫిక్స్ చేసుకున్నాడు బన్నీ. ఇలా చేయడం వల్ల వక్కంత వంశీ సినిమాను కూడా ఇదే స్పీడ్ లో ఫినిష్ చేస్తే దీపావళికి వచ్చేయచ్చు. 
అందుకే మహాశివరాత్రి సందర్భంగా టీజర్ కూడా వదిలేసారు. టీజర్ అని చెప్పి మరీ జస్ట్ అయిదు పది సెకెండ్ లు కాకుండా, నలభై ఏడు సెకెండ్ల లెంగ్త్ లో వదిలి, ఫ్యాన్స్ కు సినిమా మీద క్యూరియాసిటీని పెంచేసాడు. వున్నది ఒక్కటే ఫన్ డైలాగ్ కానీ టీజర్ లో అన్ని జోనర్లు టచ్ చేసేసారు. బన్నీ ఫన్, ఎమోషన్ కంటెంట్,  పూజ హెగ్డే గ్లామర్ జస్ట్ అలా టేస్ట్ చూపించారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ నోటి వెంట బ్రాహ్మిన్ యాస వేరు, బన్నీ నోటి వెంట వేరు. బన్నీ నోటి వెంట ఆ డైలాగ్ వింటే, జస్ట్ గోదావరి జిల్లా యాస మాదిరిగా వుందంతే. మరి సినిమాలో ఎలా వుంటుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=YA48dqwrunE

 

Show comments