ఏప్రియల్ 7న 1971

మలయాళ సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ 1971.  మామూలుగా అయితే దీని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా అవసరం వుండదు. కానీ జనతాగ్యారేజ్, మనమంతా, మన్యం పులి, ఈ మధ్య వచ్చిన కనుపాప సినిమాలతో మోహన్ లాల్ మనవాళ్లకు కూడా బాగా దగ్గరయిపోయాడు.

పైగా ఈ 1971 కు వున్న మరో సంగతేమిటి అంటే అంటే బన్నీ బ్రదర్ గా మెల్లగా ఎదిగే ఫ్రయత్నం చేస్తున్న అల్లు శిరీష్ తొలిసారి మలయాళంలో నటించింది ఈ సినిమాలోనే. మోహన్ లాల్ మేజర్ గా, శిరీష్ లెప్టినెంట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రియిల్ 7న విడుదలకు రెడీ అవుతోంది. శిరీష్ వున్నాడు కాబట్టి కాస్త తెలుగుప్రేక్షకులకు ఎలాగూ పరిచయం. మోహన్ లాల్ కు వున్న క్రేజ్ తెలిసిందే.

అందువల్ల ఈ సినిమాను తెలుగులో కూడా అదే డేట్ కు విడుదల చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొడుకు కోసం అల్లు అరవింద్ గీతా సంస్థ కానీ, లేదూ అంటే అరవింద్ సన్నిహితుడు ఠాగోర్ మధు కానీ ఈ సినిమాను విడుదల చేసే అవకాశం వుంది.

Show comments