ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఓవైపు భారీ చిత్రాలు హల్‌చల్‌ చేస్తూ వుంటే, మరోవైపు కొత్త రకం కథలని కూడా ఆడియన్స్‌ మునుపటి కంటే బాగా ఆదరిస్తున్నారు. గత వారం విడుదలైన 'సబ్‌మెరీన్‌ వార్‌' సినిమా ఘాజీకి స్టన్నింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. శాటిలైట్‌ హక్కుల ద్వారానే దాదాపు పెట్టుబడి రాబట్టుకున్న ఈ చిత్రానికి థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది.

ఈ తరహా సీరియస్‌ చిత్రాన్ని ప్రేక్షకులు చూడగలరా అనే అనుమానాలకి తెర దించుతూ ఘాజీకి అంతటా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సూపర్‌హిట్‌ స్టేటస్‌ దక్కించుకున్న ఘాజీ ఈ వారాంతంలోను స్టడీగా వుంటుందని ట్రేడ్‌ చెబుతోంది. ఓం నమో వెంకటేశాయ డిజాస్టర్‌ కాగా, సింగం 3 కూడా ఫ్లాప్‌తో సరిపెట్టుకుంది. 

నేను లోకల్‌ ముప్పయ్‌ కోట్ల మార్కుని చేరుకోగా, ఈ వారం సాయిధరమ్‌ తేజ్‌కి పరీక్ష ఎదురు కానుంది. విన్నర్‌గా అతను కూడా శర్వానంద్‌, నాని తరహాలో సూపర్‌హిట్‌ ఇస్తాడో లేదో చూడాలి. బిచ్చగాడు క్రేజ్‌తో యమన్‌గా విజయ్‌ ఆంటోనీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Show comments