మరింత మంది పార్టీని వీడతారుః బాబు

‘జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు..’ అంటూ చంద్రబాబు నాయుడు తనలోని ఫ్రస్ట్రేషన్ ను చాటుకొంటూ ఉన్నారు. తాము అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుంటే.. జగన్ తట్టుకోలేక  ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతున్నారు.. అనేది చంద్రబాబు నాయుడి మాట. అయితే బాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు తెలుగుదేశంలోకి క్యూ కట్టడంలేదు. చెప్పుకోవడానికి కూడా ఒకరిద్దరు ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రభావితం కావడంలేదు.

అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ నుంచినే నేతలు బయటకు వెళ్తున్నారు! చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఉంటే.. ఇలా టీడీపీ నేతలే పార్టీని వీడుతూ ఉన్నారు! మరి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎవరితో అర్థం చేసుకోవడం సులువే!

ఆ సంగతలా ఉంటే.. మరి కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడవచ్చు అని అన్నారట. చంద్రబాబు నాయుడు పార్టీనేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. మరికొందరు నేతలు తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారని చెప్పారట.

తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా వలసలు ఉండబోతున్నాయని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటివరకూ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ఈ వలసలు మరింతగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ విషయాన్ని చంద్రబాబే టెలీ కాన్ఫరెన్స్ లో స్వయంగా ధ్రువీకరించారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?