ఎవరో ఏదో రాసిస్తారు.. దాన్నే చదువుతారు.. అలాంటి వాటిని అడ్డం పెట్టుకుని మేధావులుగా, వ్యాపారవేత్తలుగా చలామణి అయిపోవడం పేరున్న కుటుంబాల నుంచి వచ్చే వారికి చాలా ఈజీ. అయితే ఎవరో ఏదో రాసిస్తే.. దాన్ని అలాగే చదివేసే వీళ్లకు అందులోని తప్పొప్పుల గురించి ఏం తెలుస్తాయి పాపం? అయితే కొన్నికొన్ని విషయాల గురించి ప్రసంగాలు దంచేటప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కాబోలు.
ఇప్పుడు నారా బ్రహ్మణి మాటలు వింటే ఇదే అభిప్రాయం కలగమానదు. ఇంతకీ విషయం ఏమిటంటే నారాబ్రహ్మణి జీఎస్టీ మీద ప్రసంగించిందండీ. జీఎస్టీ అమల్లోకి వచ్చిందని సంబరాలతో ఏదో కార్యక్రమం నిర్వహిస్తే దానికి హాజరై జీఎస్టీ వల్ల ఎన్నో లాభాలుంటాయని బ్రహ్మణి చెప్పుకొచ్చింది. దీని వల్ల అటు వ్యాపారస్తులకు, ఇటు ప్రజలకూ లాభమే అని నారా బ్రహ్మణి చెప్పింది. మరి ఆ లాభాలు ఏమిటో.. ఎలాంటివో వివరించలేదు. జస్ట్ లాభాలు ఉంటాయని చెప్పింది.
మరి ఈ మాట చాలా మందే చెబుతున్నారు. కానీ లాభమో, నష్టమో కొన్ని రోజులు పోతే గానీ తెలీదు. మరి ఇంత వరకూ చెప్పి ఆగని బ్రహ్మణి మరో విషయాన్ని చెప్పుకొచ్చింది. అదేమనగా.. ప్రపంచంలోని 165 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉంది.. అని నారా బ్రహ్మణి చెప్పింది. ఈ మాట కూడా ఈ మధ్య కాలంలో చాలా మందే చెబుతున్నారు. ప్రత్యేకించి బీజేపీ వాళ్లు. ప్రపంచంలోని 165 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉందని వారు అంటున్నారు.
వారి మాటనే బ్రహ్మణి కూడా వల్లెవేసింది. మరి అసలు విషయం ఏమిటంటే... జీఎస్టీ 165 దేశాల్లో అమల్లో ఉంది అనేది పెద్ద అబద్ధం. శుద్ధ అబద్ధం. జీఎస్టీపై వినిపిస్తున్న వ్యతిరేక స్వరాలను అణగదొక్కడానికి తెలివిగా తీసుకొచ్చిన ప్రచారం ఇది. ప్రపంచమంతా అమల్లో ఉంది.. అని ఒక మాట అనేస్తే భారతీయులను సగం కంట్రోల్ చేయవచ్చు. ప్రపంచమంతా ఉందంట.. కాబట్టి అది మంచిదే అయ్యుంటుందని మనోళ్లను మానసికంగా ప్రిపేర్ చేయొచ్చు.
అందుకే 165 దేశాల్లో జీఎస్టీ అనే అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అలాంటి అబద్ధాన్నే బ్రహ్మణి కూడా చెప్పుకొచ్చింది. బహుశా మోస పూరిత మాటలు మాట్లాడాలని కాదు, ఎవరో ఏదో రాసి ఇచ్చి ఉంటారు, దాన్నే చదువుతుంటారు. ఆ రాసిచ్చిన వాళ్లు ఏవో మీడియాలో విన్న, చదివిన కథనాలను బట్టి 165 దేశాలు అనే మాటను వాడి ఉంటారు.
జీఎస్టీ అన్ని దేశాల్లో అమల్లో లేదు, ఆ మాట అబద్దం అనే వాదనను బలపరుస్తున్న వారిలో నీతిఅయోగ్ సభ్యుడు వివేక్ దేవ్ రాయ్ కూడా ఉన్నారు. ఈ వాదనను ఆ ఆర్థిక మేధావి తీవ్రంగా ఖండించారు. జీఎస్టీ వల్ల లాభాలు అబద్ధమే, 165 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉన్నదీ అబద్ధమే అని ఆ మేధావి వివరించారు.
కనీసం ఆరేడు దేశాలు కూడా జీఎస్టీని అమలు చేయడం లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. మరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మానసపుత్రిక అయిన నీతి అయోగ్ లో స్వయంగా మోడీ చేత అందులో సభ్యుడిగా నియమితమైన వ్యక్తి వివేక్ దేవ్‌రాయ్.. కాబట్టి ఆయన మాటను మోడీ భక్తులు, బ్రహ్మణి లాంటి మిడిమిడి జ్ఞానవంతులు కూడా నమ్మాలి!