మళ్లీ తెలుగుని చిన్నచూపేనా బాహుబలీ?

'బాహుబలి' మొదటి భాగాన్ని ముందుగా ముంబయిలో ప్రీమియర్‌ చేసిన రాజమౌళి అండ్‌ కో రెండో భాగానికి కూడా ముంబయి ప్రీమియర్‌నే ప్లాన్‌ చేసారు. తెలుగులో రూపొందిన చిత్రానికి ఇక్కడ ప్రీమియర్‌ వేయకుండా, అనువాద వెర్షన్‌ని ముందుగా లోకానికి చూపించడం అప్పట్లో విమర్శలకి తావిచ్చింది. అయినప్పటికీ మరోసారి రాజమౌళి టీమ్‌ హిందీ ప్రీమియర్‌కే మొగ్గు చూపడం గమనార్హం.

బాహుబలి 2లో చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి కనుక సినిమాపై ఆ ఆసక్తి పీక్స్‌లో వుంది. ముందుగా హిందీ ప్రీమియర్‌ వేసినట్టయితే సోషల్‌ మీడియా, రివ్యూస్‌ వల్ల కొన్ని కీలక విషయాలు లీక్‌ అయిపోవచ్చు. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' లాంటి విషయాలని అత్యుత్సాహంతో కొందరు రివీల్‌ చేసేయవచ్చు. ప్రీమియర్‌ వేయాలనుకున్నప్పుడు తెలుగు, హిందీలో ఒకేసారి ప్లాన్‌ చేసి వుండవచ్చు.

మగధీర చిత్రానికి ముందు రోజు ప్రీమియర్‌ షోస్‌ వేయడం, ఫస్ట్‌ షో స్క్రీన్‌ అవకుండా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ రావడం తెలిసిందే. అయినప్పటికీ తెలుగు వర్షన్‌ని పక్కనపెట్టి హిందీ వాళ్ల ప్రాపకం కోసం పాకులాడడం తెలుగు వారికి నచ్చడం లేదు. బాహుబలి జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ ఇది తెలుగు సినిమా కనుక ముందుగా మన వెర్షన్‌నే ప్రపంచానికి చూపించాలనేది మనోళ్ల ఫీలింగ్‌.

Show comments