చాలా మందిని కొట్టాను, రానాను మాత్రం కొట్టలేదు

తను అనుకున్న అవుట్ పుట్ వచ్చేంతవరకు నిద్రపోడు తేజ. అవసరమైతే హీరోపై చేయి చేసుకుంటాడు కూడా. ఈ విషయంలో ఇతడిపై పరిశ్రమలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఇలాంటి దర్శకుడితో రానా సినిమా చేస్తున్నాడనగానే చాలామంది ఇదే యాంగిల్ లో ఆలోచించారు. దీనిపై తేజ వివరణ ఇచ్చాడు. రానా విషయంలో అలాంటివి జరగలేదని, అతడు చాలా ఇంటలిజెంట్ ఆర్టిస్టు అని మెచ్చుకున్నాడు.

"రానా చాలా ఇంటెలిజెంట్ యాక్టర్. ఏదైనా ఒక సీన్ గురించి చెప్తే రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పొద్దున్నే ఆ సన్నివేశానికి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటిస్తూ అదే యాటిట్యూడ్ చూపిస్తాడు. అలాంటి నటులు అరుదనే చెప్పాలి. సెట్ లో రానాలా కాకుండా జోగేంద్రలా బిహేవ్ చేసేవాడు. రానాలో ఆ ఇంటెలిజెంట్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది". ఇంత తెలివైన నటుడిపై చేయిచేసుకునేంత అవసరం ఎవరికీ ఉండదంటున్నాడు తేజ.

కెరీర్ లో చాలామంది కొత్త హీరోలతో వర్క్ చేశాడు తేజ. ఉదయ్ కిరణ్, తేజ లాంటి నటుల్ని పరిచయం చేసిన ఈ దర్శకుడు వాళ్లను కొట్టినా.. వాళ్లు పరిశ్రమకు కొత్త కాబట్టి నడిచిపోయింది. కానీ రానా అలా కాదు. ఈ సినిమా కంటే ముందు బాహుబలి-2 లాంటి భారీ విజయం అతడి చేతిలో ఉంది. దీన్ని పక్కనపెడితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత సురేష్ బాబు తనయుడు రానా. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోపై చేయి చేసుకుంటే ఏమౌతుందో తేజకు తెలియంది కాదు.

Readmore!
Show comments

Related Stories :