ప్రభాస్ అంటే నాకిష్టం.. అతడ్ని వదిలేది లేదు..!

ఈమాట ఎవరో అని ఉంటే పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదేమో. కానీ ఈ డైలాగ్ కొట్టింది ఎవరో తెలుసా.. అనుష్క. అవును.. ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని అనుష్క ఇలా బయటపెట్టింది. బాహుబలి-2 ప్రమోషన్ లో భాగంగా విదేశీ మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క.. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపింది.

ప్రభాస్-అనుష్క కాంబినేషన్ లో గతంలో కూడా సినిమాలొచ్చాయి. కానీ బాహుబలి-2తో వీళ్లిద్దరూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ జోడీగా మారిపోయారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్-అనుష్కను మరోసారి వెండితెరపై చూపించడానికి దర్శకులు ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి టైమ్ లో “ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినప్పుడల్లా నటిస్తూనే ఉంటా” అంటూ అనుష్క మనసులో మాట బయటపెట్టింది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 2 సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలకూ ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదు. వీటిలో ఒక సినిమాలో మరోసారి బొమ్మాళిని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, బాహుబలి-2 సినిమా ఇంపాక్ట్ అలాంటిది మరి.

Show comments