ఆ శ్రీకాంత్‌ ఈ శ్రీకాంత్‌ కాదుట

తొలి సినిమానే పవన్‌కళ్యాణ్‌తో చేసేసిన నికీషా పటేల్‌, ఆ సినిమాతోనే ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర వేయించేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ తెలుగులో నికీషా పటేల్‌కి సరైన గుర్తింపు ఇవ్వలేదు సరికదా, వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్లే బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడిపోయాయి. దాంతో, దాదాపుగా తెలుగు తెరమీదనుంచి ఔట్‌ అయిపోయింది నికీషా పటేల్‌. 

ప్రస్తుతం, కన్నడతోపాటు తమిళ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటోన్న నికీషా, శ్రీరామ్‌ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. శ్రీరామ్‌ అసలు పేరు శ్రీకాంత్‌. దాంతో, మన టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ సరసన నికీషా నటిస్తోందంటూ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ఆ శ్రీకాంత్‌ కాదు, నేను నటిస్తోన్నది తమిళ హీరో శ్రీకాంత్‌తో అంటూ సోషల్‌ మీడియాలో పదే పదే క్లారిటీ ఇస్తోందీ భామ. 

ఇక, ఇటీవలే సోషల్‌ మీడియాలో బికినీ ఫొటోలతో హల్‌చల్‌ షురూ చేసిన నికీషా, ఆ బికినీ పోజుల కోసం పడ్డ కష్టం గురించి ఏకరువు పెడ్తోంది. ఉదయం, సాయంత్రం జిమ్‌లో ఎక్కువసేపు కష్టపడ్డం ద్వారా అనవసరపు బరువు తగ్గించుకోవాల్సి వచ్చిందనీ, ఇదంతా బికినీ గ్లామర్‌ కోసమేనని సెలవిచ్చింది నికీషా. టాలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తూనే వున్నాయనీ, అయితే ఇదివరకటిలా తొందరపడదలచుకోలేదని నికీషా చెబుతోందిగానీ, ఆమెకి అంత సీన్‌ టాలీవుడ్‌లో వుందా.?

Show comments