కల్యాణ్ రామ్ ఇలా చేయడం వరుసగా ఇది రెండో సారి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమాను ఇలా ప్రకటించి అలా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా అంతే సైలెంట్ గా ఎనౌన్స్ చేశాడు.
జయేంద్ర దర్శకత్వంలో కొత్త నిర్మాతల్ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీని ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. ఇంతకీ ఈ జయేంద్ర ఎవరో తెలుసా? గతంలో సిద్దార్థ్ హీరోగా 180 అనే ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడే ఈ జయేంద్ర.
180 ఫ్లాప్ తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి మొహమాటపడిన ఈ డైరక్టర్.. పీసీ శ్రీరాం చొరవతో కల్యాణ్ రామ్ ను డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. జయేంద్ర-కల్యాణ్ రామ్ ప్రాజెక్టు సెట్ చేసింది పీసీ శ్రీరామేనట. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.