తెలుగుదేశానికి రోజా మానియా ఈ రేంజ్ లో ఉంది మరి!

వైకాపా ఎమ్మెల్యే రోజా మానియా తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ లో ఉంచడం ద్వారానైతేనేం, అసెంబ్లీ సాక్షిగా రోజా పై నీఛమైన కామెంట్లు చేయడం ద్వారానైతేనేం.. రోజా కు ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నించడం ద్వారానైతేనేం.. తెలుగుదేశం పార్టీ ఆమెను ఎంతంగా వేదించాలని యత్నిస్తోందో అందరికీ అర్థం అవుతూనే ఉంది.

తెలుగుదేశం పార్టీ దాడిని ధీటుగానే ఎదుర్కొంటోంది రోజా. మొన్న మహానాడు జరిగిన తీరుపై రోజా ఘాటు స్పందన మామూలుగా లేదు. ఆ ఘాటు తెలుగుదేశం పార్టీ నషాలానికి అంటే ఉంటుంది. మరి అలాంటి దెబ్బ పడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రియాక్ట్ అయ్యింది.

ఈ సారి వర్ల రామయ్య మాట్లాడుతూ.. రోజా అనుచితంగా మాట్లాడుతోందని, ఆమెను శాసనమండలికి పిలిపించి దండిస్తాం.. అని చెప్పుకొచ్చాడు. లోకేష్ ను దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అని రోజా అన్నదని.. కాబట్టి ఆమె శాసనమండలిని అవమానించినట్టే అని, ఆమెను మండలికి పిలిపించి దండిస్తామని.. వర్ల చెప్పుకొచ్చాడు.

మరి రామయ్య గారి మాటలు ఎంత కామెడీనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోకేష్ బాబును అన్నదని రోజా మీద అక్కసు కొద్దీ ఈ స్పందన ఉంది. మరి రోజా మాటల సారాంశం శాసనమండలిని అవమానించడంగా మార్చారు రామయ్య. 

మరి రోజా మాటలు మండలిని అవమనించేవే అనుకుందాం, మరి అలాంటప్పుడు వెనుకటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను చంద్రబాబు అన్న మాటలేంటి? ఒకసారి కాదు, ఆ పదేళ్లలో చంద్రబాబు నాయుడు కొన్ని వందల సార్లు మన్మోహన్ పై విమర్శలు చేశాడు. అది కూడా ఎలాగంటే.. ‘దొడ్డిదారిన ప్రధానమంత్రి అయ్యాడు..’ అని. అనగా మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడి హోదాలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించడాన్ని చంద్రబాబు లెక్కలేనని సార్లు కించపరిచాడు.

మరి చంద్రబాబు మన్మోహన్ సింగ్ వంటి మేధావిని అలాంటి మాటలు అనొచ్చు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రాజ్యాంగం అనుమతి ఉన్నప్పటికీ బాబు తన మాటలతో పేట్రేగిపోవచ్చు. మరి అలాంటి మాటలనే మరొకరు లోకేష్ బాబు విషయంలో ఉపయోగిస్తే, దొడ్డిదారిన మంత్రి అయ్యాడని అంటే.. వారిది మాత్రం దోషం. వారిని దండించాల్సిందే. మండలికి పిలిపించుని హెచ్చరించాల్సిందే, అదీ తెలుగుదేశం పార్టీ నీతి

Show comments