ఆ హీరోకు ఏమీ కాదట

డ్రగ్స్ కేసులో టాప్ హీరో ఒకరి పేరు బయటకు వచ్చేసింది. జనాలు కాస్త ఉలిక్కిపడ్డారు. అయితే టాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ హీరోకు ఏమీ కాదని తెలుస్తోంది. దీనికి కారణాలు, ధీమాలు చాలా వినిపిస్తున్నాయి. ఒకటి ఆ హీరోకి ఒకప్పుడు వుందో లేదో కానీ ఇప్పుడయితే డ్రగ్స్ అలవాటే లేదట. ఆ సంగతి అలా వుంచితే తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తితో ఆ హీరోకు చాలా సాన్నిహిత్యం వుందని తెలుస్తోంది.

ఆ హీరో, ఆ హీరో సామాజిక వర్గ జనాలతో ఆ నాయకుడు చాలా రాసుకు పూసుకు వుంటారని, అందువల్ల హీరోకు పెద్దగా ఇబ్బంది వుండదని అంటున్నారు. అంతే కాదు, అదే హీరో కి మద్దతుగా నిన్నటికి నిన్న మాట్లాడిన వ్యక్తి కి ఆంధ్రలో అధికార పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు వున్నాయట.

అక్కడి పార్టీ కీలక నేతలతో ఆ వ్యక్తికి వున్న సాన్నిహిత్యంతోనే 2014 ఎన్నికల్లో పోటీ చేయమని టికెట్ కూడా ఇచ్చారట. అయితే పోటీ చేయలేదట. అందువల్ల కావాలంటే అట్నుంచి ఇటు సిఫార్సులు కావాలన్నా చేయించుకోగలరని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇన్ని వున్నా నోటీసు ఎలా వచ్చింది అన్న దానికి కూడా సమాధానాలు వినిపిస్తున్నాయి. నోటీసు ఇవ్వకుండా తొక్కిపెడితే, నేతలతో ప్రభావితం చేసారన్న టాక్ వస్తుంది. అదే కనుక నోటీసు ఇచ్చి, పోలీసులతో క్లీన్ చిట్ వస్తే ఇక ఎవ్వరూ ఏ ప్రచారం చేయలేరు. అదీ విషయం అని తెలుస్తోంది. అంతే లెండి. వడ్డించేవాడు మనవాడైతే, నలుగుర్లో పెట్టినా, లోపల గదిలో వడ్డించినా, ఎలా కావాలంటే అలా జరుగుతుంది వ్యవహారం.

Show comments