తెలుగు తమ్ముళ్లు మళ్లీ దొరికిపోయారు!

ఓ,..తెలుగుదేశం జనాల అత్యత్సాహం ఇలా అలా వుండదు. ఇదిగో రాజధాని అంటే అదిగో ఫోటోలు అంటారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో జనాల్ని భలే మాయ చేస్తారు. కృష్ణా పుష్కరాల విషయంలో కూడా ఇప్పుడు అలాగే చేసారు అభాసవుతున్నారు. ఉన్నట్లుండి సామాజిక  మాధ్యమాల్లో కృష్ణ పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ ఫొటోలు, వాటికి డైరక్టర్ బోయపాటి చేసిన ముస్తాబు అంటూ కొన్నిఅద్భుతమైన ఫొటోలు వదిలారు. 

దాంతో జనం అహో అనుకున్నారు. తీరా చేస్తే కాస్సేపట్లోనే అసలు గుట్టు బయటకు వచ్చింది. అవి సౌత్ కొరియాలోని బన్పో బ్రిడ్జి అనే దాని ఫోటోలు అని. దాంతో ఓ పక్క బోయపాటి, మరోపక్క చంద్రబాబును వుంచి మరీ ఈ ఫోటోలు సర్క్యులేట్ చేసిన వారంతా సైలెంట్ అయిపోయారు. జనాలను మరీ ఇంతగా మాయ చేయడంలో తెలుగు తమ్ముళ్లను మించినవారు లేరేమో?

గతంలో కూడా ఇలాగే ఒకటి రెండు విషయాల్లో ఫేక్ ఫొటోలను జనాలకు సామాజిక మాధ్యమాల ద్వారా వదిలారు. దొరక్కపోతే నమ్మే జనం నమ్ముతారు. దొరికితే ఎవరో అత్యుత్సాహంతో చేసారులే అని సరిపెట్టుకుంటారు. అప్పటికీ అమాయకంగా వుండేవారు నమ్ముతూనే వుంటారు. ఈ తరహా ప్రచారమే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష.

Show comments