మెగాస్టారూ.. ఇది కాస్త ఓవర్ యేమో?

చంద్రబాబు హయాంలో పుష్కరాలు, మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకులు రెండూ ఒకేలా వున్నాయి. ఎక్కడలేని ఆర్భాటం తప్పడం లేదు. సరే 60వ పుట్టిన రోజు అంటే ఏదో హడావుడి చేసారు అనుకుంటే, 61వ పుట్టిన రోజుకు ఇంకా హడావుడి చేస్తున్నారు. టీవీలో గేమ్ షోలకు కొత్త కొత్తగా కనిపెట్టినట్లు, పుష్కరాల హారతులకు ఏవేవో పద్దతులు జోడించినట్లు, చిరు బర్త్ డేకి భలే సెలబ్రేషన్లు ఏడ్ చేస్తున్నారు. 

చిరు పుట్టిన రోజు సందర్భంగా ముందుగా వారం రోజుల పాటు చాలా అంటే చాలా గుళ్లలో పూజలు చేయిస్తారట అభిమానులు. ఓకె. బాగానేవుంది. తమ అభిమాన హీరో మంచి కోసం గుళ్లలో పూజలు చేయించడం తప్పు కాదు. కానీ ఇందులో ఓ స్కీము జోడించారు. మెగాస్టార్ కుటుంబ సభ్యులు,, బంధువులు ఒక్కో టీమ్ కు నేతృత్వం వహిస్తారు. 

అభిమానులను కో ఆర్డినేట్ చేసి ఒక్కో గుడికి ఒక్కొక్కరు హాజరవుతారు. మెగాస్టార్ సోదరి కాణిపాకం టెంపుల్ కి, సాయి ధరమ్ తేజ అంతర్వేదికి, అల్లు శిరీష్ జంగారెడ్డి గూడెం ఆంజనేయస్వామి గుడికి ఇలా ఒక్కొ టీమ్ కు ఒక్కో టెంపుల్ కు ప్రతినిధులుగా హాజరవుతారు. మిగిలిన మరికొన్ని గుళ్లకు మరి కొంతమంది బంధువులు వెళ్తారట.  ఏమిటో ఇదంతా? 150 సినిమా హిట్ కావాలనే ఏమో?

Show comments