పూరీ నీపై మోజు తీరలేదురా

పాపం, అభిమానం ఓసారి సంపాదించుకున్న తరువాత చంపుకోవడానికి టైమ్ పడుతుంది. కానీ మన సినిమా జనాలు వాళ్లంతట వాళ్లే అభిమానాలు చనిపోయేలా చేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్లు ఎంతో మంది వుండేవారు. ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..చెత్త చెత్త సినిమాలు తీసి, ఆర్జీవీ నే వాళ్లందరినీ నిట్టూర్చేలా చేసారు. 

పూరి జగన్నాధ్ అన్నా కూడా ఇష్టం వుండేవాళ్లు ఎంతో మంది వున్నారు. ఈ సినిమా అయినా బాగా చేసి వుంటారు అని ఆశగా థియేటర్ కు వచ్చేవాళ్లు.  పూరి తన సినిమాలు ఎలా పైపైన టచ్ చేసుకుంటూ వెళ్తున్నా, అభిమానించే వాళ్లు అలాగే వున్నారు. అలాగే వున్నారు అనడానికి నిన్నటికి నిన్న ఇజమ్ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ నే ఉదాహరణ. 

కళ్యాణ్ రామ్ హీరోనే కాదనలేం. కానీ ఇజమ్ సినిమాకు వచ్చిన క్రేజ్ లో ఎక్కువ క్రెడిట్ పూరీదే అనడంలో సందేహం లేదు. అందువల్లే ఆ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా సంగతి అలా వుంచితే, ఈ తరహా క్రేజ్ ను సజీవంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పూరీదే. తన స్టాండర్ట్ పెంచుకుంటూ వెళ్తారో? ఆర్జీవీలో గ్రాఫ్ ను కిందకు దించుకుంటారో?

Show comments