లోకేష్ విషయంలో బాబు స్ట్రాటజీ ఏమిటో?

ఊరుకున్నవాడితో ఊరంతా చాలదు అనేది నానుడి. మరి ఇప్పుడు ఇదే థియరీలో ముందుకు పోదాం అనుకుంటున్నారా? చంద్రబాబు? ఒక పక్క సోషల్ నెట్ వర్క్ మాధ్యమాలు, సాక్షి మీడియా పదే పదే లోకేష్ బాబు రాసలీలలు అంటూ పలు ఫొటోలను ప్రచారంలోకి తెచ్చాయి.

అవి నిజమైనవో, నకిలీవో అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం. ఏదైనా సాధ్యమే. ఆ విషయం పక్కన వుంచితే, ఫొటోలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. 

ఇప్పుడు దీన్ని ఖండించడమో, ఎదుర్కోవడమో చేయాల్సి వుంది. ఇది పూర్తిగా మార్ఫింగ్ అని, దీనిని పట్టుకుని ప్రచారం చేస్తున్నవారిని కోర్టుకు ఈడుస్తానని లోకేష్ హెచ్చరించాల్సి వుంది. లేదా బహిరంగంగా కాకపోయినా, లీగల్ గానైనా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి వుంది. కానీ ఏ పనీ బాబు కానీ, లోకేష్ కానీ చేయడం లేదు. కనీసం వారి తరపున ఎవరు చేయడం లేదు? 

మౌనం అర్థాంగీకారం అనే సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, లోకేష్ అండ్ కో ఈ ప్రచారాన్ని అంగీకరిస్తున్నారు అనుకోవాలా?లేదా అనవసరంగా ఈ ఇస్యూని కెలికితే, మరింతమందికి తెలుస్తుందని జంకుతున్నారు లేదా జాగ్రత్త తీసుకుంటున్నారు అనుకోవాలా? కానీ ఇక్కడ బాబు అండ్ కో ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. జనాల్లో సగం మంది మీడియా ఏది రాస్తే అదే నిజం అనుకునే భ్రమలో వున్నారు.

అందువల్ల జగన్ పై చాలా కథనాలు వండి వార్చి , ఈ తరహా జనాన్ని నమ్మించిన ఘనత తెలుగుదేశం అనుకూల మీడియాదే. మరి ఇప్పుడు ఇదే తరహా ప్రచారమే లోకేష్ మీద జరుగుతోందని సరిపెట్టుకున్నా కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇలాంటి వార్తలను నమ్మే జనం సంఖ్య తక్కువేమీ కాదు.

అందువల్ల బాబు ఇక ఈ లోకేష్ వ్యవహారానికి ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెట్టడం చాలా అవసరం.

Show comments