ఇది పక్కా. పవన్‌కళ్యాణ్ నేడో రేపో రాజమండ్రికి వెళ్ళనున్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పవన్‌కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతారట. ఆల్రెడీ పవన్‌కళ్యాణ్, ముద్రగడ పద్మనాభంతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు పవన్‌నీ అటు ముద్రగడనీ కలిపేందుకు ఏర్పాట్లు చేశారట.
అసలు పవన్‌కళ్యాణ్ ఎక్కడున్నాడు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడంలేదు. పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం అన్నయ్య చిరంజీవికి అయినా దొరక్కపోవచ్చేమోగానీ, పవన్‌కళ్యాణ్ ఎక్కడున్నా చంద్రబాబుకి మాత్రం అందుబాటులోనే వుంటారన్నది గత కొంతకాలంగా విన్పిస్తోన్న వాదన. ప్రత్యేక హోదా వంటి సీరియస్ అంశంలోనూ తలదూర్చని పవన్‌కళ్యాణ్, ఇప్పటిదాకా కాపు ఉద్యమంపై గట్టిగా మాట్లాడింది లేదు.
అయినప్పటికీ, పొలిటికల్ అప్‌డేట్స్‌ని పవన్‌కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడట. కాదు కాదు, చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌కి అప్‌డేట్స్ అందిస్తున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్షను ప్రశాంతంగా ముగించడానికి, పవన్‌కళ్యాణ్‌ని రంగంలోకి దించడమే కరెక్ట్.. అన్నది చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహాల్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారమ్.
ముద్రగడతో పవన్ సంప్రదింపులు, ఆ తర్వాత ముద్రగడ దీక్ష విరమణ.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయట. పవన్‌కళ్యాణ్‌నే ఎందుకు దించాలి.? అంటే, దీనికి చంద్రబాబు వద్ద స్పష్టమైన సమాధానం వుంది. ఎప్పుడూ చిరంజీవిని ఏదో ఒక రకంగా విమర్శించే దాసరి నారాయణరావు కూడా కాపు ఉద్యమం కోసం చిరంజీవిని కలుపుకుపోవడం చంద్రబాబుకి అస్సలేమాత్రం నచ్చలేదు.
కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు చెందిన కాపు ప్రముఖులు ఒక్కతాటిపైకి రావడంతో చంద్రబాబులో అలజడి బయల్దేరిందట. ఏ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే దెబ్బతీయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్. ఇప్పుడు కాపు ఐక్యతను దెబ్బతీయడానికి, కాపు సామాజికవర్గానికే చెందిన పవన్‌కళ్యాణ్‌ని రంగంలోకి దించుతున్నారట.
ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ మీడియాకి సైతం అందనీయడంలేదు చంద్రబాబు. తెలంగాణ కోసం కేసీఆర్, నిమ్స్‌లో నిరాహార దీక్ష చేసినప్పుడూ ఇలాంటి దారుణ పరిస్థితుల్లేవు. దటీజ్ చంద్రబాబు. అంత వ్యూహాత్మకంగా ముద్రగడ దీక్షను డౌన్ ప్లే చేయిస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో ఆ దీక్షకు ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారన్నమాట. ఇలాంటి వ్యూహాల్లో చంద్రబాబు మించినోళ్ళెవరుంటారు.?