వెస్ట్ గోదావరి తీరంలో 'దేశం' మునక?

ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ ప్రతిసారీ జరగవు. జగన్ పై చాలా తెలివిగా పుట్టించిన ప్రచారం పుణ్యమా అని మొత్తం క్షత్రియులంతా జగన్ పై కత్తి కట్టారు. ఇది 2014 ఎన్నికల సంగతి. వెస్ట్ గోదావరిలో ఉప్పు-నిప్పులా వుండే క్షత్రియులు, కాపులు కలిసి మరీ పనిచేసి, తెలుగుదేశం కొమ్ము కాసారు. దాంతో  అక్కడ నూరుశాతం సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం.  అంతే కాదు, ఈ ప్రభావం విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లొ కూడా కనిపించింది. ఆ కృతజ్ఞతతోనే కావచ్చు, తొలిసారిగా దొరికిన కేంద్రమంత్రి పదవిని అశోక్ గజపతికి అందించారు బాబు.

మళ్లీ మరోసారి వెస్ట్ గోదావరి జిల్లా ఆ అద్భుతం చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.  వెస్ట్ గోదావరిలో బాబుకు అనుకూలంగా వున్న క్షత్రియులను టార్గెట్ చేసే పరిణామాలు ఊపందుకుంటున్నాయి. అది కూడా బాబుకు ప్రియ నేస్తం పవన్ కళ్యాణ్ రూపంలో. భీమవరం ప్రాంతంలో నిర్మించే మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను పవన్ వ్యతిరేకిస్తున్నారు. అక్కడి జనం ఈ ప్రాజెక్టుపై పోరాడుతున్నారు. ఈ ప్లాంట్ అన్నది తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

పవన్ కళ్యాణ్ దీని మంచి చెడ్డలు చర్చించడానికి బదులు, ఇవి కులపోరాటాలుగా మారే ప్రమాదం వుందని హెచ్చరించడం విశేషం. దీనికి కారణం మరేమీ లేదు. ఈ అక్వా ఫుడ్ ప్లాంట్ యజమానులు క్షత్రియులు కావడమే,. వెస్ట్ గోదావరిలో ప్రతిష్టాత్మక ఆనంద గ్రూప్ భాగస్వామ్యంలోనిదే ఈ కొత్త ఆక్వా ప్లాంట్. ఆనంద గ్రూప్ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు తదితరులది.

ఈప్లాంట్ వస్తే పంటలు పోతాయి, నీళ్లు కలుషితం అవుతాయి అని చెప్పడం వేరు. కానీ పవన్ వాటికన్నా ఎక్కువగా సంపద కొందరి దగ్గరే పోగవుతోంది. అది కూడా అగ్రవర్ణాల దగ్గరే, దీనివల్ల కులపోరాటాలు వస్తాయి అంటూ ఏవేవో చెప్పారు. అంటే పరోక్షంగా ఆయన ప్యాక్టరీ యజమానులైన క్షత్రియులకు, పోరాడుతున్న ఇతర కులాల వారికి మధ్య మరి కాస్త ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. Readmore!

ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? పవన్ కోసం, ఆయన వెనుక వున్నకాపు ఓట్ల కోసం ప్రాజెక్టును రద్దు చేయాలా? లేక క్షత్రియుల మద్దతు కోసం ముందుకే వెళ్లాలా? మరోచోట మరో విధంగా మరో మంచి ప్రాజెక్టు ఇస్తానని, ఆక్వా ప్లాంట్ యజమానులను బుజ్జగించి, రద్దు చేయడం బాబుకు కష్టం కాదు. కానీ అసలే ప్రతిష్ఠ అంటే ప్రాణం పెట్టే క్షత్రియులు దీన్ని ఏవిధంగా తీసుకుంటారు. మొత్తానికి ఎలాగైనా వెస్ట్ గోదావరి తీరంలో 2014 న ఒక తాటిపైకి వచ్చిన క్షత్రియ, కాపు వర్గాలు ఇప్పుడు ఎదురుఎదురుగా నిల్చునే పరిస్థితిని పవన్ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.

Show comments

Related Stories :