బాహుబలి-2 సాక్షిగా బయటపడిన జాతి వివక్ష

బాహుబలి-2 సినిమా ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ లో తాము జాతి వివక్షను ఎదుర్కొన్నట్టు స్వయంగా ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. విమానాశ్రయంలో ఎమిరేట్స్ సిబ్బంది తమపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని నిర్మాత శోభు ఏకంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే జాతి వివిక్ష, బాహుబలి-2 సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ లో కూడా కనిపించింది.

భారత కాలమానం ప్రకారం, దుబాయ్ లో నిన్న సాయంత్రం 5 గంటలకే షో ప్రారంభమైంది. అప్పటికే టిక్కెట్లు కొనుక్కున్న ఎంతోమంది భారతీయులు (తెలుగు వాళ్లతో పాటు ఉత్తరాది వాళ్లు కూడా) థియేటర్లకు చేరుకున్నారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే థియేటర్ లో అలజడి చెలరేగింది. ఏం జరుగుతోందో మిగతా ప్రేక్షకులకు తెలిసేలోపే సీన్ పెద్దదైపోయింది.

థియేటర్ యాజమాన్యంతో కలిసి కొందరు స్థానికులు సినిమా చూస్తున్న ప్రేక్షకులపై (భారతీయులపై) జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో గొడవ ప్రారంభమైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక దశలో స్థానిక పోలీసుల నుంచి కూడా తమకు సహకారం అందలేదని కొందరు తెలుగువాళ్లు ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద 20 నిమిషాల పాటు షో నిలిపివేసి, కొందర్ని బయటకు పంపించిన తర్వాత తిరిగి సినిమాను కొనసాగించారు.

Show comments