రామ్‌గోపాల్‌ వర్మకి 'పవర్‌' పంచ్‌.!

'ఓసారి పైకి ఎత్తేసి, ఇంకోసారి కిందకి దించేసే వ్యక్తుల గురించి నేనేం మాట్లాడాలి.? ఈ మధ్యనే రామ్‌గోపాల్‌ వర్మ కుమార్తెకు పెళ్ళయ్యింది. కానీ, పోర్నోగ్రఫీ సినిమాల్ని కలెక్ట్‌ చేస్తుంటానని చెప్పే వర్మ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరముందా.?' 

- ఇదీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల సారాంశం. 

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీతో వర్మ 'ఫైటింగ్‌' కొనసాగుతున్న విషయం విదితమే. వీలు చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీకి యాంటీగా సెటైర్లు వేస్తుంటాడు రామ్‌గోపాల్‌ వర్మ. అలా వర్మ వేసే సెటైర్ల పుణ్యమా అని నాగబాబుకి ఒళ్ళు మండిపోయింది. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కడిగి పారేశాడాయన. వర్మ తక్కువేమన్నా తిన్నాడా.? నాగబాబుపై దుమ్మెత్తిపోసేశాడు. అఫ్‌కోర్స్‌, ఆ తర్వాత చిరంజీవి కూడా వర్మని తనదైన స్టయిల్లో విమర్శించేశాడనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడు, పవన్‌కళ్యాణ్‌ వంతు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్‌ చూపిస్తున్న తెగువ మహేష్‌బాబుకి లేదా.? అని వర్మ ప్రశ్నించాడు ట్విట్టర్‌లో. పవన్‌ని పొగిడేస్తూ పొగిడేస్తూ.. చివరికి పవన్‌పై సెటైర్లు షురూ చేసేశాడు వర్మ. నాయకుడు, యుద్ధ రంగంలో లేకపోతే సైన్యం ఏమయిపోతుంది.? అని వర్మ ప్రశ్నించిన విషయం విదితమే.  Readmore!

మొత్తమ్మీద, ఉగ్గబట్టుకుని ఉగ్గబట్టుకుని నాగబాబు ఎలాగైతే అసహనం వ్యక్తం చేశాడో, చిరంజీవి ఎలాగైతే సున్నితంగానే అయినా వర్మకి కౌంటర్‌ ఇచ్చారో, అచ్చం అలాగే పవన్‌ కూడా మీడియా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానంగా వర్మపై విరుచుకుపడ్డాడనుకోవచ్చు.

Show comments