హీరోయిన్లు.. హీరో, నిర్మాతల బెడ్రూమ్‌లకు వెళ్లాల్సిందేనా?

ఒకవైపు చాలా మంది హీరోయిన్లు.. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించుకొంటూ వస్తున్నారు. అవకాశాల వేటలో ఉన్నప్పుడు తమను ఫలానా హీరో బాగా ఇబ్బంది పెట్టాడని, బెడ్రూమ్‌కు రప్పించుకోవడానికి ప్రయత్నించాడని.. తాము లొంగలేదని.. కొందరు చెబుతుంటే, ఇంకొందరు.. లొంగామని ఇన్‌ డైరెక్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో దక్షిణాది ఇండస్ట్రీ మీదే వారు ముద్ర వేస్తున్నారు. సౌత్‌లో హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కువ... అని చాలా మంది హీరోయిన్లు స్టేట్‌ మెంట్లు ఇచ్చారిప్పటికే. 

చరిత్రను చూస్తే.. తమను ఫలానా హీరో వేధిస్తున్నాడు అంటూ ప్రెస్‌మీట్లు పెట్టిన హీరోయిన్లు కూడా కనిపిస్తారు టాలీవుడ్‌లో. సినిమా వాళ్లపై సదాభిప్రాయాన్ని కాపాడటానికే మెజారిటీ మీడియా వర్గం ప్రయత్నిస్తుంది కాబట్టి.. చాలా విషయాలు త్వరగా మరుగున పడతాయి. కానీ.. తరచిచూస్తే.. డైరెక్టుగా ఫలానా హీరోనే మమ్మల్ని వేధించాడు అని మీడియా ముందుకు వచ్చిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలుగా చలామణి అయ్యేవాళ్లు ఇలాంటి రంకులను రగ్గుల కింద దాచిపెట్టటడంలో విజయవంతం అవుతూ ఉంటారు.

ఆ మధ్య కన్నడ ఇండస్ట్రీలో ఇలాంటి గొడవే ఒకటి చెలరేగితే హీరో దర్శన్‌ను వదిలిపెట్టి.. హీరోయిన్‌ నిఖిత మీద మాత్రం అబాండం వేసి వదిలారు అక్కడి సినీ పెద్దలు. అలాంటి పంచాయితీలు తెలుగులో బోలెడున్నాయి. స్టార్‌ హీరోలుగా పేరు పొందిన వారి మీదే ఆ ఆరోపణలున్నాయి. వీరెవరూ శ్రీరామచంద్రులు కాదనే క్లారిటీనూ ఉంది.

మరి ఇలాంటి నేపథ్యంలో కొంతమంది హీరోయిన్లు ఇన్‌ డైరెక్టుగా ఆరోపణలు చేస్తున్నారు. తాము అవకాశాల వేటలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని, తమను ఫలానా హీరో వేధించాడని, ఆఖరికి తెలుగులో సినిమాలనే వదిలేసుకున్నామని వారితో తట్టుకోలేకపోయామని.. ఇలాంటి రకరకాల కబుర్లు చెబుతున్నారు.. అయితే వారి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే.. గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరినట్టుగా! ఈ కాస్టింగ్‌ కోచ్‌ ఆరోపణలు.. కేవలం మసాలా వార్తల్లా మారాయి కానీ, ఈ విషయంలో అలాంటి ఆరోపణలు చేస్తున్న హీరోయిన్లపై పెద్దగా జాలి చూపేంత తీరిక జనాలకు లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీపై సదాభిప్రాయం లేదు కాబట్టి! 

మమ్మల్ని ఫలానా హీరో వేధించాడు.. బెడ్రూమ్‌ రమ్మన్నాడు.. అని కొంతమంది హీరోలు ఫజిల్స్‌లా చెబుతుంటే, అవునా.. అతడెవరై ఉంటారబ్బా.. అన్నట్టుగా జనాలు ఆలోచిస్తున్నారు. అతడు సినిమాల్లో చేశాడు, రాజకీయాల్లోకి వచ్చాడూ.. అంటూ హీరోయిన్లు నర్మగఠంగా చెబుతుంటే, ఆ జాబితాలోని వారిని లిస్టౌట్‌ చేసుకుని.. ఎవరికి వారు ఒక పేరనేసుకుని అహా.. అంటున్నారు నెటిజన్లు. మామూలుగా వేరే ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నామని చెబితే జాలి చూపే వాళ్లు కొంతమంది అయినా ఉంటారు కానీ, సినీ ఇండస్ట్రీపై అలాంటి జాలి లేకుండా పోయింది. హీరోయిన్లను దేవతగా ఆరాధించేదీ ప్రేక్షకులే.. వాళ్లను అత్యంత తక్కువ చేసి చూసేది అదే ప్రేక్షకులే! ఒకే హీరోయిన్‌ విషయంలోనూ రెండు రకాల దక్పథాలుంటాయి.. అదే విచిత్రం!

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకతరం వారు కాదు, ఒక వయసు వారు కాదు.. గుప్తంగా ఉండిపోతాయనే పేరున్న ఈ లైంగిక వేధింపులకు సంబంధించి, బెడ్రూమ్‌లకు రప్పించుకోవడానికి సంబంధించిన వివరాలను చాలా మంది హీరోయిన్లు బాహాటంగానే చెబుతున్నారు. రెండు దశాబ్దాల కిందటి హీరోయిన అర్చనతో మొదలుపెడితే.. నేటి తరం నటీమణుల వరకూ చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. డైరెక్టుగా ఆరోపణలు చేసిన వాళ్లే వీళ్లంతా.

ఎవరు... రమ్మన్నారు, అనే విషయం గురించి కూడా వీరంతా సూఛాయగా చెబుతున్నారు. అయితే అందరూ బయటపడరు, పడబోరు కూడా. ఇప్పుడు బయటపడుతున్న వాళ్లుకూడా.. పూర్తి నిజాలనేమీ చెప్పడం లేదు. తాము ఎదుర్కొన్న అనుభవాల పూర్తి వివరాలను చెప్పడం లేదు. వీళ్లు పైపైన చెబుతుంటేనే.. సంచలనాలు అవుతున్నాయి, పూర్తి వివరాలు చెబితే.. అంతకు మించిన సంచలనం ఉండదు. అప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలే పుట్టుకురావొచ్చు!

ఇండస్ట్రీని బాగా ఎరిగిన వారు చెప్పే మాట.. ఇక్కడ లీడ్‌లో ఉన్న హీరోల వేధింపులు అల్లాటప్పాగా ఉండవనేది. తన పరపతిని ఉపయోగించుకుని అవకాశాలు ఇప్పించగల, ఇవ్వగల స్థాయిలో ఉన్న హీరో కానీ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ.. అమ్మాయిల విషయంలో కీచకుడిలా మారిపోతాడనేది అనేక మందిని ఉదాహరిస్తూ చెబుతారు ఈ ఫీల్డ్‌ను ఎరిగిన వారు. పైకి సాధువుల్లా.. సినిమాల్లో శ్రీరామచంద్రుల్లా కనిపించే చాలా మంది వికృత రూపాలు వాస్తవంలో చూడలేనంత దారుణంగా ఉంటాయని, చూసి భరించలేనట్టుగా ఉంటాయని వారు చెబుతారు. అంతావాళ్లే అని.. వీరిలో కొంతమంది కీచకుడంతటి క్రూరులని చెబుతారు. 

ఇద్దరు హీరోయిన్లను ఒకేసారి బెడ్‌కూ తీసుకెళ్లే అలావాటున్న దర్శకులున్నారు. వాళ్లే ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్లుగా చలామణి అవుతుంటారు. హీరోయిన్‌ను రప్పించుకోవడానికి ఆమె తల్లితో కూడా అత్యంత వికృతంగా ప్రవర్తించిన నేపథ్యం కలిగిన వారున్నారు. వేరే సినిమా సెట్‌కు వచ్చి తనకు పరిచయస్తురాలైన హీరోయిన్‌ని అందరి కళ్లముందూ దౌర్జన్యంగా ఎత్తుకెళ్లి కొన్ని రోజుల తర్వాత వదిలిన వారు లెజెండ్స్‌గా చలామణి అవుతున్నారు. హీరోయిన్లను అడ్డం పెట్టుకుని తార్పుడు వ్యవహారాలను నడిపిన వారు... ఆఖరికి కూతుళ్లను ఎరగా వేసిన నరమాంస విక్రేతలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని.. వీళ్లంతా చాలా ఫేమ్‌ను కలిగి ఉన్న వారు, అందరూ ఎరిగిన వారు.. చాలామంది పాలిట దేవుళ్లు అని కొత్తగా చెప్పనక్కర్లేదు. 

వీళ్ల గురించి మీడియా మంచిని మాత్రామే చూపుతుంది.. అది మీడియా అవసరం మంచితనం. ఇక ఆ వ్యవహారాలన్నీ వారి వ్యక్తిగతం కూడా. అయితే ఈ వ్యక్తిగతమైన వ్యవహారాలు వేధింపుల వరకూ వచ్చినా చాలాసార్లు బయటకు రావు. ఒక్కోసారి మాత్రం కొంతమంది హీరోయిన్లు ఏదో బాధతోనో.. కసితోనో.. బయటకు చెబుతుంటారు. తట్టుకోలేనంత స్థాయిలోని వేధింపుల గురించి పదిమంది ముందుకు వచ్చి చెబుతూ ఉంటారు. అలాంటప్పుడే.. కొందరి అసలు రూపాయలు నగ్నంగా బయటపడుతూ ఉంటాయి.

మరి ఇవన్నీ కాదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే హీరోయిన్లు.. నిజంగా బెడ్రూమ్‌కు వెళ్లాల్సిందేనా? లొంగాల్సిందేనా? అని ఒక సీనియర్‌ నటీమణి దగ్గర ఆరా తీయడం జరిగింది. ఆమె ఇండస్ట్రీలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన వ్యక్తి. హీరోయిన్‌గా నటించింది.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసింది.. ఇండస్ట్రీలో అనేక పంచాయితీల్లో బాగస్వామి అయ్యింది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా కూడా ఇండస్ట్రీకి పూర్తిగా టచ్‌లో ఉందామె. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీని కాచివడబోసింది. ఆమె నిక్కచ్చిగా చెప్పే అభిప్రాయం ఒక్కటీ చాలు.. ఇండస్ట్రీపై శాశ్వతమైన అభిప్రాయం ఏర్పడటానికి. 

ఇంతకీ ఏమన్నారంటే.. 'లొంగక తప్పకపోవచ్చు.. అయితే అతిగా లొంగితే మాత్రం అంతే. అతిగా లొంగితే.. తేలేది సినీ ఇండస్ట్రీలో కాదు.. వ్యభిచార గృహంలో..' అని సూటిగా సుత్తి లేకుండా చెప్పారామె. ఆమెను అడిగిన ప్రశ్న ఎంత సూటిగా ఉందో.. చెప్పిన సమాధానం కూడా అంతే సూటిగా ఉంది. నిలదొక్కుకోవాలంటే.. లొంగాల్సిందే అన్నట్టుగా మాట్లాడారామె. అయితే అక్కడ కూడా లౌక్యం, లాజిక్‌ ఉండాల్సిందే అని స్పష్టం చేశారు.. అవి లేకపోతే ఏమవుతుందో కూడా స్పష్టంగా చెప్పారు. తమను బెడ్రూమ్‌ రప్పించే యత్నాలు జరిగాయని.. చాలా మంది చెబుతుంటే వాళ్లు చెబుతున్నది కూడా సగం నిజమే, అసలు విషయం మాత్రం వాళ్లూ చెప్పడం లేదు అనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది ఆ వెటరన్‌ హీరోయిన్‌ మాట. ఈ మధ్య తరచూ ఇలాంటి మాటలతో మీడియాకు ఎక్కుతున్న హీరోయిన్ల మాటలన్నింటి కంక్లూజన్‌లా ఉంది ఆ సీనియర్‌ నటీమణి మాట. ఎలాంటి హిపోక్రసీ లేకుండా.. ఇండస్ట్రీ అసలు గుట్టును చెప్పారామె. అదీ కథ.

Show comments