పవన్ ఉవాచ..

అనంతపురం సభలో పవన్ ప్రసంగ ముఖ్యాంశాలు

స్పెషల్ ప్యాకేజీ హార్వర్డ్ లాంటి పెద్ద పెద్ద వర్సిటీల్లో చదివిన వారు రూపొందించింది. నాలాంటి ఒంగోలు వీధిబడిలో చదివి, టెన్త్ గ్రేస్ మార్కులతో పాస్ అయిన వారికి అర్థం కావడానికి టైమ్ పట్టింది.

నిపుణులతో చర్చించాను. అంతా అయిన తరువాత తెలిసిందేమిటి అంటే మనకు ఇవ్వాల్సిందే ఇచ్చారు తప్ప వేరు కాదు.

ఓట్ల కోసం అర్థం అయ్యేలా మాట్లాడతారు. ప్యాకేజీల్లో మాత్రం అర్థం కాని భాష వాడతారు. Readmore!

ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టచ్చు..తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించవచ్చు. హోదా రాకపోతే ఇంక చూస్కోండి అనొచ్చు. ప్యాకేజ్ కు సన్మానాలు చేయించుకున్నవారు వున్నారు. హోదా పరశువేది కాదు అంటారు. 

స్పెషల్ స్టేటస్ అన్నది మీకు ముగిసిన అధ్యాయం. కానీ అనంతపురం లాంటి కరువు జిల్లాలకు అది అమృతపు చుక్క.

నేను కుటుంబం మీద మమకారం పక్కన పెట్టి భాజపాకు, తేదేపాకు వంత పాడింది, కేవలం రాష్ట్రానికి నిధులు వస్తాయనే. కానీ అది జరగనపుడు ఖాళీగా కూర్చోను. జీ హుజూర్ అంటూ కూర్చునే బానిసను కాదు. 

Show comments