ఎక్స్‌పోజింగ్‌ని ప్రశ్నించినా వివక్షేనట

ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కి వెళ్ళాక ఆమె చుట్టూ వివాదాలూ పెరిగిపోయాయి. కారణం, ఆమె వస్త్రధారణే. నిజానికి, బాలీవుడ్‌ సినిమాల్లోనే ప్రియాంకా చోప్రా ఓవర్‌ డోస్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసేసింది. కానీ, హాలీవుడ్‌కి వెళ్ళిన తర్వాతే తన పేరు వివాదాల్లో ఎక్కువగా విన్పిస్తుండడం ఆమెకు చాలా చిత్రంగా అన్పిస్తోందట. పైగా, సినిమాల్లో వస్త్రధారణ కన్నా ఇతరత్రా సందర్భాల్లో తన వస్త్రధారణను వివాదాస్పదం చేయడం ప్రియాంకా చోప్రాలో అసహనాన్ని పెంచేస్తోంది. 

మొన్నీమధ్యనే ప్రధాని నరేంద్రమోడీని విదేశాల్లో కలిసినప్పుడు ప్రియాంక షార్ట్‌ డ్రస్‌ వేసుకోవడం ఆమె అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన విషయం విదితమే. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది ఈ అంశంపై. ఇప్పటికే ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ప్రియాంకా చోప్రా మరోమారు, తన వస్త్ర ధారణపై స్పందించింది. 

'రోమ్‌లో వున్నప్పుడు రోమన్‌లానే వుండాలి..' అంటూ, 'విదేశాల్లో మహిళల వస్త్రధారణను చూస్తే, ఎవరూ నన్ను విమర్శించడానికి సాహసించరు' అని ఓ ప్రశ్నకి సమాధానమిచ్చింది ప్రియాంకా చోప్రా. తాను భారతీయ మహిళనేననీ, తనకు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు బాగా తెలుసనీ, ఈ విషయంలో తనకెవరూ సర్టిఫికెట్‌ ఇవ్వక్కర్లేదని ప్రియాంక చెప్పుకొచ్చింది. 

'మోకాళ్ళు కన్పించేలా ప్రధాని ముందు కూర్చోవడంపై విమర్శలకు, తల్లి నుంచి వచ్చిన జీన్స్‌.. అని ప్రస్తావిస్తూ అభ్యంతకర రీతిలో ఫొటో పోస్ట్‌ చేయడమెందుకట.?' అని ప్రశ్నిస్తే, అందులో అసభ్యత ఏముందో తనకు అర్థం కాలేదని ప్రియాంక అంటోంది. ఇలాంటి వివాదాలు కూడా వివక్ష కిందకే వస్తాయనీ, అబ్బాయిల వస్త్రధారణపై రాని విమర్శలు మహిళలపై రావడం చూస్తోంటే, అలా విమర్శలు చేసేవారు ఇంకా మానసికంగా పరిపక్వత చెందలేదేమోననిపిస్తుందని ప్రియాంక చెబుతోంది.

Show comments