బాహుబలి-2 : ఏపీ, తెలంగాణ 10 రోజుల వసూళ్లు

విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లు సాధిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న బాహుబలి-2 తెలుగు రాష్ట్రాల్లో తన హవా కొనసాగిస్తోంది. మరో బడా సినిమా బరిలో లేకపోవడం, సినిమాపై క్రేజ్ ఇంకా తగ్గకపోవడంతో  విడుదలైన 10 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బాహుబలి - ది కంక్లూజన్ ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. 

మరోవైపు పార్ట్-1 సాధించిన రికార్డుల్ని కూడా పార్ట్-2 క్రాస్ చేస్తోంది. నైజాం ప్రాంతంలో బాహుబలి పార్ట్-1కు ఫుల్ రన్ లో 43 కోట్ల రూపాయలు వస్తే.. రిలీజై 2 వారాలైనా కాకముందే బాహుబలి-2 ఆ రికార్డును అధిగమించింది. ఈ వీకెండ్ నాటికి నైజాంలో 50కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది.

తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ :
నైజాం  -  45 కోట్లు
సీడెడ్  - 24.20 కోట్లు
నెల్లూరు  - 5.17 కోట్లు
కృష్ణా  - 9.89 కోట్లు
గుంటూరు - 13.50 కోట్లు
వైజాగ్  - 18.10 కోట్లు
తూర్పు గోదావరి  - 13.25
పశ్చిమ గోదావరి  - 9.98 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ : 139.09 కోట్లు

Show comments