రకుల్‌ పట్టిందల్లా బంగారమే

టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీ అంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరే చెప్పాలి. ఒప్పుకున్నవీ, దాదాపు ఖరారైనవీ లెక్కేస్తే, అరడజనుకు పైగానే సినిమాలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేతిలో వున్నాయి. చరణ్‌తో 'ధృవ', మహేష్‌ - మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా, ఇది కాకుండా మరికొన్ని సినిమాలతో రకుల్‌, టాలీవుడ్‌లో ఇంకే ఇతర హీరోయిన్‌ లేనంత బిజీగా వుంది. 

సినిమా సంపాదనే కాదు, ఇతరత్రా సంపాదనలోనూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో వుందిప్పుడు. తాజాగా బిగ్‌-సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి, భారీ ఆఫర్‌ ఇచ్చిందట ఆ సంస్థ. అదెంత.? అంటే, కళ్ళు చెదిరే ఫిగర్‌.. (రెమ్యునరేషన్‌) అని గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఎప్పుడెవరు లైమ్‌లైట్‌లో వుంటే, వాళ్ళకి భారీ ఆఫర్స్‌ ఇచ్చి, బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంటుంది బిగ్‌-సి సంస్థ. అలా ఇప్పుడు రకుల్‌కి ఈ బంపర్‌ ఆఫర్‌ దక్కిందన్నమాట. 

అందాల భామలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే, సదరు సంస్థ రెప్యుటేషన్‌ పెరుగుతుందా.? అన్న విషయం పక్కన పెడితే, తమ బ్రాండ్‌ వాల్యూ మాత్రం అమాంతం పెరిగిపోతుందని ఆ సంస్థ చెబుతోంది. కోటిన్నరకు పైగానే సినిమాల్లో రెమ్యునరేషన్‌ అందుకుంటున్న రకుల్‌, పెద్ద హీరో.. చిన్న హీరో.. అని ఏమాత్రం ఆలోచించడంలేదు. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లే చేజిక్కించుకుంటోంది. 'బ్రహ్మూెత్సవం'లో ఆఫర్‌ వదిలేసుకున్నా, మహేష్‌ - మురుగదాస్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన విషయం విదితమే. ఏదిఏమైనా, రకుల్‌ టాలీవుడ్‌లో పట్టిందల్లా బంగారమే అవుతోంది కదూ.! 

Readmore!
Show comments

Related Stories :