తెలుగు సినిమాకు ఎంత కష్టం

మహేష్ బాబు పాతిక కోట్లు..ఎన్టీఆర్ 15 కోట్లు..పవన్ 18 కోట్లు..రకుల్ కోటి రూపాయిలు..

సరైనోడు 75 కోట్లు..జనతా గ్యారేజ్ 80 కోట్లు..

ఇలాంటి ఫిగర్లన్నీ తరచు టాలీవుడ్ లో వినిపిస్తుంటాయి. 

కానీ ఇన్ కమ్ టాక్ రికార్డులు చూసే అవకాశమే వుంటే..అందులో సగానికి సగం కూడా కనిపించవు. మరి మిగిలిన సగం లేనట్లా? ఉన్నట్లా?  ఉంటే ఎక్కడికి వెళ్తున్నట్లు? 

బ్లాక్..బ్లాక్.బ్లాక్..తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలామణీ అవుతున్నంత బ్లాక్ మనీ మరి ఎక్కడా చలామణీ కాదేమో? కింద నుంచి మీద వరకు 24 క్రాఫ్ట్ ల్లోనూ బ్లాక్ మనీ అన్నది తప్పదు. సినిమాకు సంబంధించినంత వరకు సగం పేమెంట్లు బ్లాక్ లోనే జరుగుతాయి. అది ఎవరికైనా సరే, 

థియేటర్ల దగ్గర ప్రారంభమవుతుంది వ్యవహారం. రోజువారీ కలెక్షన్ల రిపోర్డులు రెండు రకాలుగా తయారవుతాయి. అధికారికంగా ఒకటి, అనధికారికంగా మరొకటి. అంటే అక్కడే సినిమా ఆదాయం సగానికి సగంగా డివైడ్ అయిపోతుంది. అద్దెలు కూడా అంతే. ఖర్చులు అంతే. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రకరకాల పద్దులుగా విడిపోతాయి. బయ్యర్లు నిర్మాతలకు చెల్లించేది ఈ విధంగానే. నిర్మాతలు హీరోల దగ్గర నుంచి కింద వరకు పేమెంట్లు చేసేది ఇలాగే. 

ఫైనాన్స్ వడ్డీలు మూడు నుంచి అయిదు రూపాయిలు వుంటాయి. ఒక్కోసారి అత్యవసరంలో పది రూపాయిలు. కానీ లెక్కలు చూస్తే అలా వుండవు. మరి ఇదంతా..బ్లాక్..బ్లాక్..బ్లాక్..

హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లుగా కోట్లకు కోట్లు ఇస్తారు. కానీ ఎక్కువగా అడ్వాన్స్ లుగా చూపించరు. చేబదులుగా కొన్ని చూపిస్తారు. అడ్వాన్స్ లు గా కొన్ని చూపిస్తారు. కొన్నయితే అసలు కాగితాలే వుండవు. సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు వ్యవహారాలు నోటి మాటతోనే నడుస్తాయి. వీటన్నింటికి మూలం బ్లాక్ మనీ. ఎందుకంటే హీరోలకు వైట్ మనీ అంటే కాస్త ఎలర్జీ

బాహుబలి-శాతకర్ణి-ఖైదీ 150

ఇప్పుడు ఎంత కష్టం వచ్చి పడింది. ముందుగా కష్టం వచ్చేది శాతకర్ణి-ఖైదీ 150లకే. ఎందుకంటే ఈ కొత్త సిస్టమ్ ఏమిటి? దీన్ని ఎలా అధిగమించాలి అన్న విషయాలు సెట్ కావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈలోగా విడుదలవుతున్నాయి శాతకర్ణి, ఖైదీ 150. వీటికి బయ్యర్ల అగ్రిమెంట్లు, కాస్త అడ్వాన్స్ లు మాత్రమే జరిగాయి. ఇప్పుడు ఫైనల్ పేమెంట్లు ఎలా? ఒక్కో సినిమాను యాభై నుంచి డెభై కోట్ల రేంజ్ లో అమ్మారు. మహా అయితే అడ్వాన్స్ లుగా పది నుంచి ఇరవై కోట్లు అంది వుంటాయి. మిగిలిన దాంట్లో సగం బ్లాక్ నే వుంటుంది. 

అంటే ఈ రెండు సినిమాలకు కలిపి కనీసం పాతిక కోట్లకు పైగా బ్లాక్ మనీ తేవాలి. ఎలా? బాహుబలి కి సమస్య వుండదంటున్నారు. ఎందుకంటే బాహుబలి బిజినెస్ అంతా చెక్ ల మీదే నడుస్తోందని వినికిడి. ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి 150 కోట్ల రేంజ్ లో అమ్మకాలు. మరి ఇందులో అధికారికంగా ఎంత వుంటుందో తెలియదు. అనధికారం ఎంతో తెలియదు. మరి ఆ మేరకు ఎలా డబ్బులు అడ్జస్ట్ చేస్తారో? 

మేధావులు మనవాళ్లు

అయితే మన టాలీవుడ్ జనాలు మేధావులు, క్షణాల్లో దేనికైనా విరుగుడు కనిపెడతారేమో? చూడాలి. ఎందుకంటే ఈ టాలీవుడ్ విధానాలు అన్నీ మన వాళ్ల సృష్టే.ఇక్కడి రూల్స్, పద్దతులు, సిండికేట్లు, ఫైనాన్స్ అన్నీ ఇక్కడ మాత్రమే కనిపించేవి. అందువల్ల ఇప్పుడు కొత్త కొత్త విధానాలు వస్తాయి. కొన్నాళ్లకు. అప్పటి దాకా సమస్య.

ఇది సాహసోపేత నిర్ణయం - పివిపి

దక్షిణ భారతంలొ మొట్టమొదటి సారిగా మేం పూర్తి వైట్ లోనే పేమెంట్లు జరిపాం. పేమెంట్లు అన్నీ చెక్ ల ద్వారానే చేసాం. ఇకపై ఇండస్ట్రీలో అందరూ ఇలాగే చేయాల్సి వుంటుంది. దీని మూలాన ఎవరికి ఎక్కడా ఏ సమస్య అన్నది వుండదు. ఏ సినిమా లాభం, ఏ  సినిమా నష్టం అన్నది క్లారిటీగా వుంటుంది. మోడీ తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేత, శుభపరిణామ నిర్ణయం. ఇఫ్పటికే బాలీవుడ్ మొత్తం చెక్ ల పైనే నడుస్తోంది. టాలీవుడ్ కూడా ఇక ఆ బాటలోనే నడవాలి. ఇందుకు టాలీవుడ్ కు చెందిన ప్రతి ఒక్కరు సహకరించాల్సి వుంటుంది. 

Show comments