సురేష్ చేతిలో డిస్కోరాజా

రవితేజ - విఐ ఆనంద్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా డిస్కోరాజా. ఈ సినిమా డిసెంబర్ విడుదల అని టాక్ వుంది. కానీ ఫిబ్రవరి లేదా ఎర్లీ సమ్మర్ లో విడుదలవుతుందిని గ్యాసిప్ కూడా వుంది. సినిమాకు కాస్త గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువే వుండడంతో డిసెంబర్ కు రావడం కష్టం అన్నది వినవస్తున్న వార్తల సారాంశం.

ఇదిలావుంటే ఈ సినిమా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీకి తీసుకుంది. సాధారణంగా రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమాలు అమ్ముకుంటారు. కానీ డిస్కోరాజా నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం తన సినిమాను డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వడం విశేషం. అది కూడా ఎటువంటి అడ్వాన్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే మరో నాలుగైదు సినిమాలను కూడా ఒకేసారి సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుంది. శ్రీ విష్ణు తిప్పరా మీసం, తరుణ్ భాస్కర్.. మీకు మాత్రమే చెప్తా, పీపుల్స్ మీడియా 'వెంకీ మామ', సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలు సురేష్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments