తీహార్ కు సోనియాగాంధీ.. రెండో పరామర్శ!

తన పార్టీ ముఖ్య నేతలను తీహార్ జైలుకు వెళ్లి పరామర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ. ఇదివరకే ఆమె కేంద్ర మాజీమంత్రి చిదంబరాన్ని వెళ్లి పరామర్శించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆయనను కొన్నాళ్ల కిందట తీహార్ తరలించారు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో మాత్రం ఆయన జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

ఇప్పటికే ఆయనను పరామర్శించి సోనియాగాంధీ తన పని బాధ్యత పూర్తి చేసుకున్నారు. ఇక చిదంబరం తర్వాత అరెస్టు అయిన డీకే శివకుమార కూడా ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈయనకు పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి వెళ్లి శివకుమారను పరామర్శించారు.

ఇక సోనియాగాంధీ కూడా ఆ బాధ్యతను పూర్తిచేశారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉండిన శివకుమారను ఆమె పరామర్శించారు. గతంలో తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు ఎన్నిక చేయడంలో శివకుమార చాలానే సహకరించారు సోనియాగాంధీకి. 

ఈ అరెస్టులు అన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అందుకే స్వయంగా సోనియాగాంధీ పరామర్శలకు దిగారు. అయినా సోనియాగాంధీ తన చేతిలో పవర్ ఉన్నప్పుడు.. తన రాజకీయ విరోధులు చాలా మందికి ఇలాంటి గతే పట్టించింది కదా, ఇప్పుడు ఆమెకు పరామర్శలు తప్పడంలేదు.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!

Show comments