ఆ హీరో ఇంట పాతిక కోట్లు?

టాలీవుఢ్ లో వెయ్యి నోట్ల రద్దు ప్రకంపనలు చినచిన్నగా బయటకు వస్తున్నాయి. నిజమో కాదో తెలియని గ్యాసిప్ ఒకటి గుప్పు మంటోంది. టాలీవుఢ్ లో టాప్ టెన్ హీరోల్లో ఒకరైన ఓ హీరో ఇంట్లో పాతిక కోట్ల వరకు క్యాష్ వుండిపోయిందన్నది ఆ గ్యాసిప్. ఆ హీరోకు చాలా అంటే చాలా వ్యాపారాలు వున్నాయి. ఆది నుంచీ ఆయన నటుడిగానే కాకుండా మంచి ఎంటర్ పెన్యూర్ గా కూడా పేరు సంపాదించారు. 

అనేక మంది ఫ్రెండ్స్ తో కలిసి రకరకాల వ్యాపారాలు సాగించారు, సాగిస్తున్నారు. కొన్ని అయితే నేషనల్ లెవెల్ లో కూడా వున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టారని అంటారు.  రెండు మూడేళ్ల క్రితం ఆయన వందల కోట్లలో రియల్ ఎస్టేట్ డీల్స్ చేసారని వదంతులు వున్నాయి. అప్పట్లో భారీ క్యాష్ ఆయన ఇంట చేరిందని, అందులో అలా అలా సర్దుబాటు పోగా, పాతిక కోట్ల వరకు ఇంకా మిగిలిందని అంటున్నారు. అదే ఇప్పుడు ఆ హీరో టెన్షన్ కు కారణమైందంటున్నారు. 

నిన్నటికి నిన్న వెయ్యి, అయిదు వందల నోట్లు క్యాన్సిల్ అన్న మాట వినగానే ఆ హీరో తన అత్యంత సన్నిహితులతో, ఆడిటర్లతో సమావేశం అయినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలా వీటిని డిక్లేర్ చేయచ్చు, ఏం చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ వుండదు అనే విషయమై సమాలోచనలు ఇప్పటికీ సాగుతున్నట్లు తెలుస్తోంది.

Readmore!
Show comments