జనసేన - లేబులే మారింది

జనసేన..పవన్ పార్టీ లేటెస్ట్ వెర్షన్. నిజానికి పవన్ పార్టీకి ఓల్డ్ వెర్షన్లు రెండు వున్నాయి. కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని ఒకటి వుండాలి. అదేమయిందో, దానికి ఇచ్చిన డొనేషన్లు ఏమయ్యాయో పవన్ కే తెలియాలి. అది అలా వుంటే ప్రజారాజ్యం అనే పార్టీకి పిల్లశాఖగా యువరాజ్యం అనేదాన్ని పవన్ ప్రారంభించారు. దాని తరపునే పవన్ ఆంధ్ర అంతా తిరిగి, రెచ్చిపోయే ప్రసంగాలు చేసారు అప్పట్లో. 

చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కు గుత్తగా ఇచ్చేయడంతో, ఈ యువరాజ్యం ఏమయిందో తెలియదు. అన్న తన చిత్తానికి తన పార్టీని తాను ఇచ్చేసినట్లు, పవన్ తన యువరాజ్యాన్ని ఏం చేసారో? ఇది ప్రశ్న అయితే జవాబు...జనసేన.

అవును జనసేన అన్నది యువరాజ్యానికి లెటెస్ట్ వెర్షన్ మాత్రమే అని వినికిడి. పవన్ తరపున ఆయన చుట్టూ వుండి, జనసేన పనులు ఇప్పుడు చకచకబెడతున్నది అప్పటి యువరాజ్యం పనుల్లో పవన్ కు సహాయంగా వున్న జనాలేనట. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కు మ్యాన్ పవర్ గా వున్నది అప్పట్లో యువరాజ్యం సమయంలో పరిచయం అయినవారేనట. లేటెస్ట్ గా పవన్ పార్టీ పేరిట కోశాధికారిగా ప్రకటనలు ఇస్తున్న రాఘవయ్య కూడా యువరాజ్యం నుంచి పవన్ వెంట వుంటున్నవారేనట.

ఇక పవన్ సంగతి చెప్పనక్కరే లేదు. ఆయనే యువరాజ్యం అధినేత. అంటే అధినేత ఆయనే..అనుచర గణం అదే. యువరాజ్యం బదులు, జనసేనగా మారింది అన్నమాట. 

Show comments