పీక్స్ కు చేరిన పోటీ: బరిలోకి ఐడియా

జియో, ఎయిర్ టెల్ మధ్య ఇప్పటికే “డేటా పోటీ” నడుస్తోంది. ఇద్దరూ పోటీపడి మరీ ఫ్రీ డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడీ రేసులోకి ఐడియా కూడా ఎంటరైంది. రోజుకు 1.5జీబీ ఉచిత 4జీ డేటా అందించే ప్లాన్ ప్రకటించింది. 696రూపాయల ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఈ ఉచిత డేటా పథకాన్ని ప్రవేశపెట్టింది ఐడియా.

తాజా ప్రకటనతో జియో, ఎయిర్ టెల్, ఐడియా మధ్య పోటీ మొదలైంది. ఇప్పటివరకు జియో, ఎయిర్ టెల్ రోజుకు కేవలం 1జీబీ ఉచిత డేటాను మాత్రమే అందిస్తున్నాయి. ఐడియా మాత్రం 1.5 జీబీ ప్రకటించింది. 696రూపాయలకు 84రోజుల పాటు వర్తించేలా ప్యాకేజ్ ప్రకటించింది.

దాదాపు ఎయిర్ టెల్, జియో కూడా 84రోజులకే ప్యాకేజీ ప్రకటించాయి. కాకపోతే రీచార్జీల్లో మాత్రం సంస్థల మధ్య చాలా తేడాలున్నాయి. అన్నింటికంటే తక్కువ ధరలకు జియో ప్యాకేజీలే లభ్యమవుతున్నాయి. తాజాగా జియో సంస్థ 349, 399 ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రతి ఆఫర్ లో అన్-లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఉచిత డేట్ కామన్ గా ఉంది.

ఇవన్నీ చూస్తున్న బీఎస్ఎన్ఎల్ కూడా ఉచిత ఆఫర్లు ప్రకటించింది. 429రూపాయలకే 90రోజులకు వర్తించేలా, రోజుకు 1జీబీ డేటా ఉచితంగా అందించేలా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అన్ని సంస్థలు 100రూపాయలకు అటుఇటుగా దాదాపు ఒకే రకమైన ప్యాకేజీని అందిస్తున్నాయి. కాకపోతే కనెక్టివిటీ, డేటా స్పీడ్ ఆధారంగా ఎక్కువమంది కస్టమర్లు జియో, ఎయిర్ టెల్ వైపు మొగ్గుచూపుతున్నారు.

Show comments