రవిప్రకాష్.. ఎందుకింత ఆనందం

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరితే.... ఒక మనిషి ఎదుగుదలపై కచ్చితంగా అసూయాద్వేషాలు వుంటాయి. అలాంటి మనిషి, నెత్తురు కక్కుంటూ నేలకు రాలిపోతే, అయ్యో అనేవారు తక్కువ. కచ్చితంగా కొంత ఆనందం చాలావరకు వ్యక్తం అవుతుంది. ఇది సాధారణంగా రెండు రకాలుగా అనుకోవాలి.

ఒకటి పాజిటివ్ రెస్పాన్స్, రెండు నెగిటివ్ రెస్పాన్స్..
తెలుగునాట విజువల్ మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించి, టీవీ 9ను తన ఇంటి పేరుగా మార్చుకున్న రవిప్రకాష్ ఇప్పుడు కిందకు జారిపోతుంటే కేవలం జర్నలిస్ట్ కమ్యూనిటీనో, పొలిటికల్ కమ్యూనిటీనో హడావుడి పడడంలేదు. తెలుగునాట సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, హిందూత్వ వాదులు, కొన్ని కులాలవారు ఇలా అనేకమంది ఎందుకు ఆనందిస్తున్నారు. ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాల్లో ఎందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హర్షం వ్యక్తం అవుతోంది.

రవిప్రకాష్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న భావన జనాల్లో బాగా నాటుకుపోవడం వల్ల. చిన్న చిన్న ఉద్యోగులను, చిన్న చిన్న తప్పులు చేసిన వారిని భయంకరంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం వున్నాయని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అవినీతి బురదలో పీకల వరకు దిగిపోయిన రాజకీయ నాయకులతో రవిప్రకాష్ కు చెట్టాపట్టాలు వున్నాయని, వార్తలు వున్నాయి.

కేవలం టీవీ 9ను చూసే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాని యజమానులకు ఓ సెజ్ ఇచ్చేసారని వదంతులు వున్నాయి. కానీ అంత సాయం చేసిన వైఎస్ కొడుకు అంటే మాత్రం టీవీ9కు విపరీతమైన పగ, ద్వేషం అని కూడా వదంతులు వున్నాయి. ఇవన్నీ కలిసి రవిప్రకాష్ కు కనిపించని శతృవులను, చాలామందిలో ద్వేషాన్ని పెంచాయి.

హిందూ మత ప్రియులు, కొన్ని సామాజిక వర్గాల మనోభావాలను టీవీ 9 పదే పదే దెబ్బతీసిందనే ప్రచారం వుంది. అది కూడా రవిప్రకాష్ ఖాతాలోనే పడింది. ఇలా అన్నీ కలిసి రవిప్రకాష్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. టీవీ9 ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచగలిగిందేమో కానీ, రవిప్రకాష్ కు జనాల్లో పాజిటివ్ నేమ్ ను తీసుకురాలేకపోయింది.

అందువల్ల ఇప్పుడు రవిప్రకాష్ కు ఇలా జరిగింది అంటే ఒక్కరు అయ్యో అనడం లేదు. టీవీ9 రవిప్రకాష్ స్వయం కృషికి నిదర్శనం అయితే, ఈ నిస్క్రమణ ఆయన స్వయకృతాపరాథం.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

Show comments